విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీస రాజధాని కూడా లేని ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు భయంకరమైన అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డారని ముఖ్యంగా అమరావతిని రాజధానిగా ప్రకటించడం పట్ల చంద్రబాబు ముందుగానే ఇన్ సైడర్ ట్రేడింగ్ పద్ధతి ద్వారా తన పార్టీ నాయకులతో మరియు బినామీలతో అమరావతి రాజధాని ప్రాంతంలో….అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందు కేవలం తన వర్గ ప్రజలకు మేలు చేయడం కోసం చంద్రబాబు ఆంధ్ర ప్రజల భవిష్యత్తుతో ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకునే అమరావతి రాజధాని గా ప్రకటించడం జరిగినది అని ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసిపి పార్టీ ఆరోపణలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా 21 నిమిషాల ఇన్ సైడర్ ట్రేడింగ్ చంద్రబాబు ఏ విధంగా అధికారంలో పాల్పడ్డారో భూములు ఏ విధంగా తన వారికి కట్టబెట్టారో ఎక్కడ ఎన్ని ఎకరాలు కొనటం జరిగిందో అన్ని విషయాలను వీడియో రూపంలో వైసిపి పార్టీ ఇటీవల వీడియో విడుదల చేయడం జరిగింది.

 

ఈ వీడియోలో చంద్రబాబు నాయుడు, లింగమనేని రమేష్, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ లతో పాటూ, యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్, ధూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహన రావు పేర్లు తో పాటూ చాలా మంది పేర్లు ఉన్నాయి. వీరంతా నిబంధనలను తుంగలో తొక్కి వేలాది ఎకరాలు కారుచౌకగా కొన్నట్లు ఆరోపణలున్నాయి. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను అతి తక్కువ ధరకు ప్రభుత్వం లాండ్ పూలింగ్ పేరుతో సేకరించినట్లు వాటినే టీడీపీ నేతలకు పందేరం చేసినట్లు ప్రభుత్వం ఆరోపిస్తోంది.

 

తెల్లరేషన్ కార్డు దారులకు కూడా ఇక్కడ వందలాది ఎకరాలున్నట్లుగా రికార్డుల్లో ఉందని వారంతా టీడీపీ నేతల బినామీలేనని కారు డ్రైవర్లు, పనిమనుషుల పేర్లపై కూడా భూములున్నాయని జగన్ సర్కార్ విడుదల చేసిన వీడియో లో తేలింది. అంతేకాకుండా త్వరలోనే వీరి పై విచారణ జరిగే అవకాశం ఉందని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.  సీఆర్ డీఏ అనే సంస్థ పూర్తిగా చంద్రబాబు డైరెక్షన్లో పని చేసిందని చివరాకరికి జగన్ సర్కార్ తేల్చేసింది.  

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: