జగన్ ప్రకటించిన మూడు రాజధానిలో నిర్ణయం తర్వాత రాజధాని అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న విషయం తెలిసిందే. నిరసనలు ధర్నాలు ఆందోళనలతో అమరావతి మొత్తం అట్టుడికిపోతోంది. ఏకంగా సకల జనుల సమ్మె కు కూడా పిలుపునిచ్చారు అమరావతి రైతులు. ఇకపోతే అమరావతిలో నిరసన తెలుపుతున్న రైతులందరికీ టిడిపి జనసేన పార్టీలు మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అమరావతి లో పర్యటించిన పవన్ కళ్యాణ్ అమరావతి రైతుల నిరసన కు మద్దతు తెలిపారు. దీంతో వైసీపీ నేతలు అందరూ పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేయడం మొదలుపెట్టారు. గతం లో అమరావతి వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు సమర్ధిస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే తనపై వస్తున్న విమర్శలపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా బదులిచ్చారు. 

 

 

 తాను అమరావతిని వ్యతిరేకించాను  అంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం తప్పుడు ప్రచారం అని తేల్చి చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తాను  ఎప్పుడు అమరావతిని వ్యతిరేకించలేదని బలవంతంగా భూములు సేకరిస్తే ఉద్యమిస్తాం అని మాత్రమే చెప్పాను అంటూ గుర్తు చేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి 33 వేల ఎకరాలు సేకరించడం అవసరమా అని మాత్రమే ఆనాడు ప్రశ్నించానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రభుత్వ మారితే భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి అంటూ ఆయన ప్రశ్నించారు. అప్పట్లో అమరావతి నిర్మాణానికి నేతలు ప్రజలు అందరూ మద్దతు తెలిపారని.. అమరావతి నిర్మాణానికి ఎవరు అభ్యంతరం తెలపలేదు అని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఏర్పాటు చేస్తామన్న రాజధానికి కూడా వారి అందరి మద్దతు ఉండాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

 

 

 

 అమరావతి నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతులందరికీ న్యాయం చేయాలి అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా రాజధాని పై వైసీపీ నేతలు చేస్తున్న పరస్పర విరుద్ధ ప్రకటనలు రాజధాని రైతులు అందరిని గందరగోళానికి గురి చేస్తున్నాయని ఆరోపించారు. టిడిపి నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్ కి పాల్పడ్డారు అని చెబుతున్న వైసీపీ నేతలు... ఇన్సైడర్ ట్రేడింగ్ కి పాల్పడిన అందరి పేర్లు తమ వద్ద ఉన్నాయని చెబుతూ కాలయాపన ఎందుకు చేస్తున్నారు అంటూ పవన్ విమర్శించారు. ఇలాంటి ఆరోపణలు చేస్తూ రోజులు గడిపే బదులు అమరావతి లో అక్రమాలు చేసిన వారిపై కేసులు పెట్టి చర్యలు తీసుకోండి అంటూ పవన్ కళ్యాణ్ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: