ఢిల్లీలో అదృశ్యమైన తెలుగు డాక్టర్ల మిస్సింగ్ మిస్టరీ వీడింది. ఇద్దరు డాక్టర్లను సిక్కింలో గుర్తించారు పొలీసులు. ప్రత్యేక పోలీసు టీమ్ లను పంపించి వారిని సురక్షితంగా ఢిల్లీకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. కుటుంబ సభ్యుల సమక్షంలో వారికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు.  

 

సంచలనం రేపిన ఢిల్లీ డాక్టర్ల మిస్సింగ్ మిస్టరీని  వీడింది. అదృశ్యమైన తెలుగు వైద్యులు సిక్కింలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. డిసెంబర్ 25న.. ఢిల్లీలో తెలుగు డాక్టర్లు దిలీప్ సత్య.. హిమబిందు.. ఇద్దరు మిస్ అయ్యారు. వారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేదా హత్యకు గురయ్యారా? అనే సందేహాలు వినిపించాయి. ఇద్దరి కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డాక్టర్లను ట్రేస్ చేయటంలో పోలీసులు టెక్నాలజీని వాడారు. మొబైల్స్ ఆచూకీ, బ్యాంక్ ఎకౌంట్ ల పై నిఘా పెట్టడంతో సిక్కింలో ఈ ఇద్దరు ఉన్నట్టు గుర్తించారు. 

 

శ్రీధర్, దిలీప్, హిమబిందు ముగ్గురు ఎంబీబీఎస్‌ లో క్లాస్ మేట్స్. మంచి ఫ్రెండ్స్ కూడా. శ్రీధర్ అతని భార్య హిమబిందు ప్రస్తుతం ఢిల్లీలో వైద్యులుగా పనిచేస్తున్నారు. దిలీప్ ఛండీగడ్ లో ఉంటున్నాడు. ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన దిలీప్‌ ని ట్రెయిన్ ఎక్కించేందుకు హిమబిందు డిసెంబర్ 25న రైల్వేస్టేషన్ కు వెళ్లింది. అప్పటి నుంచి వారిద్దరూ కనిపించకుండా పోయారు. ఫోన్ లు స్విచ్ఛాఫ్ వస్తుండటంతో కంగారుపడిన శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చంఢీగడ్ లో ఉంటున్న దిలీప్ భార్య దివ్య కూడా ఆందోళనగా ఢిల్లీ చేరుకుంది. రెండు ఫోన్లు సిచ్ఛాఫ్ రావడం.. వారిద్దరు రోడ్డుపై నడుస్తున్న ఓ వీడియో మాత్రమే లభించడంతో కేసు దర్యాప్తు కష్టంగా మారింది. ఈ క్రమంలోనే ఎన్నో అనుమానాలు తలెత్తాయి. చివరికి సోషల్ మీడియా సాయంతో వారిద్దరు సిక్కింలో ఉన్నట్లు గుర్తించి బుధవారం అదుపులోకి తీసుకున్నారు. 

 

ఇద్దరు డాక్టర్ల బ్యాంక్ అకౌంట్స్ పై నిఘా పెట్టిన పోలీసులు.. వారి అకౌంట్స్ నుంచి డబ్బులు డ్రా చేయటం.. ఎక్కడెక్కడ డ్రాలు జరుగుతున్నాయి? క్రెడిట్ కార్డులు ఎక్కడెక్కడ యూజ్ అవుతున్నాయి అనే అంశాన్ని గుర్తించారు. ఈ క్రమంలో వారు సిక్కింలో ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు వారిని ఢిల్లీకి తీసుకువచ్చారు. కుటుంబ సభ్యుల సమక్షంలో వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. వారు ఎటువంటి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చింది. వారిద్దరి మధ్యా ఉన్న సంబంధం ఏమిటి? అనే అంశాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఢిల్లీనుంచి సిక్కిం ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. ఇటువంటి పరిస్థితికి ఎందుకు రావాల్సి వచ్చింది అని పోలీసులు దిలీప్ సత్య, హిమబిందులను ప్రశ్నిస్తున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: