ఎక్కువగా ఫులులు  సింహాలు ఇతర జంతువుల పై దాడి చేయడం చూస్తూ ఉంటాయి . కానీ పులులు సింహాలు చాలా తక్కువగా వాటిపై అవి దాడి చేసుకుంటాయి. ఎందుకంటే ఇతర జంతువుల కంటే వాటి కంటే తక్కువ బలం ఉంటుంది కాబట్టి వాటిని చంపేసి తింటూ ఉంటాయి. కానీ పులులు, సింహాలకు సమానమైన బలం  మాత్రం ఉంటుంది కాబట్టి వాటి జోలికి వెళ్ళవు గొడవలు పడవు. మరి జూ లో ఉంచిన పులులు గొడవలు పడతాయా... అబ్బే చుట్టూ కంచె లు ఉంటాయి కదా ఇంకా  ఎందుకు గొడవలు పడతాయి అంటారా. కానీ ఇక్కడ ఒక పులి ఏకంగా కంచెలను బద్దలు కొట్టుకొని మరి దూసుకొచ్చి  ఆడపులిని చంపేసింది. ఈ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. 

 

 

 వివరాల్లోకి వెళితే.. ఆడపులిని  మగపులి  దారుణంగా చంపేసిన ఘటన రాజస్థాన్లోని ఉదయపూర్ బయోలాజికల్ పార్క్ లో చోటుచేసుకుంది. ఇక్కడి సజ్జన్ ఘడ్ అనే పార్కులో దామిని అనే ఆడ పులి... కుమార్ అనే మగ పులులు  ఉన్నాయి. అయితే కుమార్ అనే మగ పులి ఎప్పుడు దూకుడుగా వ్యవహరిస్తు  ఉంటుంది. దామిని అనే ఆడ పులి మాత్రం ఎప్పుడు సౌమ్యంగా... దూకుడుగా లేకుండా ఉంటుంది. ఇకపోతే కుమార్ అనే మగ  పులిని.. ఒక స్పెషల్ ఎన్ క్లోజర్  లో  అధికారులు ఉంచారు.. కుమార్ అనే మగ  పులి పక్కనే...దామిని  అనే ఆడపులి నీ కూడా మరో స్పెషల్ ఎన్ క్లోజర్ లో  అధికారులు ఉంచారు. 

 

 

 ఈ క్రమంలో ఈ రెండు పులుల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ... ఏకంగా ఎప్పుడు దూకుడుగా వ్యవహరించే కుమార్ అనే మగ  పులి అడ్డుగా ఉన్న వైర్లను తెంపి మరి బలవంతంగా దామిని అనే ఆడ పులి ఉన్న ఎన్ క్లోజర్ లోకి  దూసుకొచ్చింది. అయితే బలమైన తీగలను తెంపి న మగ  పులి కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. అయినప్పటికీ ఆడపులి దామిని ఎన్ క్లోజర్ లోకి  దూసుకొచ్చిన మగ  పులి కుమార్.. ఆడపులి పీక కొరికి ఆ పులిని చంపేసింది. దాని మరణానికి కారణం అయిపోయింది. ఈ విషయాన్ని వెల్లడించిన పార్క్ అధికారి జివి రెడ్డి... ఆడపులి దామిని కళేబరాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: