ఉల్లిధరలు.. గత రెండు నెలలుగా ఎంత దారుణంగా చుక్కలు చుపించాయో అందరికి తెలిసిందే. అయితే ఈ ఉల్లిధరలు మాములుగా కాదు గత సంవత్సరం అంత మధ్యతరగతి ప్రజలను టార్చర్ చేశాయి. అయితే అంత టార్చర్ చేసిన ఉల్లి ధరలు 2020 స్పెషల్ గా గుడ్ న్యూస్ చెప్పాయి.. 2020 సంవత్సరం వచ్చిన మూడు రోజులలోనే మంచి గుడ్ న్యూస్ చెప్పింది.      

 

మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా ఉల్లిపంట పాడైపోవడం వల్ల హైదరాబాద్‌కు ఉల్లిసరఫరా తగ్గింది. ఇక తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ర్టాల్లోనూ ఉల్లిపంట ఆశించనంతగా లేక పోవడం, ఉత్పత్తి అయిన ఉల్లిలో చాలా మటుకు వర్షాలకు తడిసిపాడైపోయింది. దీంతో ఉల్లిధరలు భారీగా పెరిగిపోయాయి. కేజీ ఉల్లిపాయ 300 రూపాయలకు చేరింది.    

 

ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆఫ్గానిస్తాను ఇతర దేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఈజిప్ట్‌ నుంచి కూడా కొంత ఉల్లిని దిగుమతి చేసుకుని రైతు బజార్ల ద్వారా కిలో 50 రూపాయలకు అమ్మకాలు చేపట్టింది. అయితే ఇటీవల మహారాష్ట్రలో కొత్తపంట చేతికి రావడంతో దేశంలోని వివిధ రాష్ర్టాలకు ఉల్లిసరఫరాను ప్రారంభించారు.    

 

అలాంటి ఈ ఉల్లి ధర మహారాష్ట్ర పుణ్యమా అని హోల్‌సేల్‌ మార్కెట్‌లో ఫస్ట్‌క్వాలిటీ ఉల్లిగడ్డ క్వింటాల్‌కు 13వేల నుంచి 14వేల రూపాయలు పలుకుతోంది. దీంతో రిటైల్‌ మార్కెట్‌లో కిలో ఉల్లిగడ్డ 100 నుంచి 130 రూపాయలు పలుకుతోంది. ఇక సెకండ్‌ క్వాలిటీ ఉల్లిగడ్డ రిటైల్‌ మార్కెట్‌లో కిలో ఉల్లి గడ్డ కిలో ఉల్లిగడ్డ 54 నుంచి 70 రూపాయలకు అమ్ముతున్నారు. చిన్న సైజు ఉల్లి ధరలు కేజీ 25 రూపాయలకు చేరాయి. ఏది ఏమైనా 2020 లో ఉల్లి ధరలు మంచి గుడ్ న్యూస్ చెప్పింది అనే చెప్పాలి.     

మరింత సమాచారం తెలుసుకోండి: