గత పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన కవితకు తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురైనా విషయం తెలిసిందే. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు అయినప్పటికీ కూడా కవిత కు ఘోర పరాజయం ఎదురైంది. దీంతో పార్లమెంట్ ఎలక్షన్ల లో తన సొంత కూతురిని కూడా కేసీఆర్ గెలిపించుకోలేని పోయారు అని అప్రతిష్ఠ మూట కట్టుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇకపోతే తాజాగా మరోసారి కవితను ఎంపీగా కాబోతుంది అని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. టిఆర్ఎస్ నుంచి మాజీ  ఎంపీ కవిత దాదాపుగా రాజ్యసభకు వెళ్లడం ఖాయమని సమాచారం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి త్వరలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ రెండు రాజ్యసభ స్థానాలు ఒక స్థానంలో మాజీ ఎంపీ కెసిఆర్ కూతురు కవితకు  కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది. కానీ రెండో సీటు ఎవరికి దక్కబోతోంది అనేది మాత్రం ఇంకా టిఆర్ఎస్ పార్టీలో క్లారిటీగా లేదట. 

 

 

 అయితే తెలంగాణకు 7, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 11 రాజ్యసభ స్థానాలను కేటాయించారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి ఐదు స్థానాలకు టిఆర్ఎస్ కు చెందిన సంతోష్ కుమార్,  బండ ప్రకాష్,  బడుగుల లింగయ్య,  కెప్టెన్ లక్ష్మీకాంతారావు,  డి.శ్రీనివాస్ ఉండగా రెండు స్థానాలకు బీజేపీ నుంచి గరికపాటి మోహన్ రావు  కాంగ్రెస్ నుంచి కేవీపీ రామచంద్రరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే తెలంగాణకు చెందిన రాజ్యసభ  సభ్యుడు కె కేశవరావు రాష్ట్ర విభజన సమయంలో ఏపీ కోటలోకి వెళ్లిపోయారు. రెండు తెలుగు రాష్ట్రాలకు  సంబంధించి ఇదే ఏడాదిలో ఏప్రిల్ 9న ఆరుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది. 

 

 

 శ్రీ నాలుగు రాజ్యసభ స్థానాల్లో  రెండు తెలంగాణకు చెందినవి కాగా నాలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందుతాయి. అయితే  గరికపాటి,  కెవిపి,  ఏపీ కోటాలో ఉన్న కేకే పదవీ కాలం కూడా అదే రోజు ముగుస్తుంది. ఏపీ కోటాలో ఉన్న కేకే కు  మళ్లీ పదవి దక్కడం కష్టమే అని గులాబీ నేతల చర్చలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేల బలం వుండటం తో రెండు సీట్లను టిఆర్ఎస్ ఏకగ్రీవంగా దక్కించుకోవడం ఖాయమని తెలుస్తోంది. ఈ రెండు స్థానాల్లో ఒక స్థానాన్ని కెసిఆర్ కూతురు మాజీ ఎంపీ కవితకు కాయం అయినప్పటికీ రెండో సీటు విషయంలో మాత్రం పలు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికలు ముగిసేలోపు రాజ్యసభ అభ్యర్థులపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ రెండు స్థానాలు ఏప్రిల్ లోనే ఖాళీ ఉన్నప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఫిబ్రవరి మార్చిలో ఎన్నికల ప్రక్రియను ముగించాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: