ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాక వైయస్ జగన్ కులం, మతం, ప్రాంతం మరియు పార్టీలకు అతీతంగా పరిపాలన అందిస్తూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సంక్షేమం విషయంలో ఏ ఒక్కరికి అన్యాయం చేయకుండా తనకి అద్భుతమైన మెజార్టీ ఇచ్చి ప్రతిపక్షాలకు దిమ్మతిరిగిపోయే విధంగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టిన సామాన్యులకు అవినీతి లేని ప్రభుత్వాన్ని అందిస్తానని పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఎక్కడ అవినీతి జరిగినా ఉపేక్షించేది లేదని ప్రమాణ స్వీకారం చేసే రోజున జగన్ స్పష్టం చేయడం జరిగింది. ఇదే తరుణంలో పరిపాలనలోకి తనదైన శైలిలో ముద్ర వేస్తూ ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందుబాటులో ఉండే విధంగా ముఖ్యంగా సామాన్యులకు ఎక్కడ ఏ విధమైన అన్యాయం జరగకుండా సీఎం జగన్ అనేక నిర్ణయాలు ఇప్పటికీ తీసుకోవడం జరిగింది.

 

స్పందన వంటి కార్యక్రమాలను ప్రతి కలెక్టరేట్లో జరిపిస్తూ వస్తున్న జగన్ తాజాగా తాను స్వయంగా ఇంప్లిమెంట్ చేసిన అవినీతికి సంబంధించి ఫిర్యాదుల కోసం ఏర్పాటుచేసిన 14400 కాల్ సెంటర్  విషయంలో జగన్ కి చిర్రెత్తుకొచ్చినట్లు ఈ విషయంలో ఏసీబీ అధికారుల పనితనం పై జగన్ సీరియస్ అయినట్లు అందుతున్న సమాచారం.

 

విషయంలోకి వెళితే రాష్ట్రంలో ఎక్కడా కూడా అవినీతి లేకుండా  ఎమ్మార్వో.. రిజిస్ట్రేషన్ .. టౌన్ ప్లానింగ్ ఆఫీసుల్లో.. ఇలా ఎక్కడా కూడా ఎలాంటి అవినీతి ఉండకూడదన్న ఉద్దేశంతో ఎవరైనా లంచం తీసుకోవడానికి భయపడే పరిస్థితి రావాలని ఏర్పాటుచేసిన కాల్ సెంటర్ విషయంలో అవినీతి నిరోధక చట్టం యొక్క పనితనం సరిగాలేదని రాబోయే మూడు నెలలలో చేంజ్ రాకపోతే విషయం వేరే లా ఉంటుందని పని తీరు మార్చుకోవాలి అవసరమైతే సిబ్బందిని ఏర్పాటు చేసుకోండి ఎలాంటి సదుపాయాలు కావాలన్నా ప్రభుత్వం సహకరిస్తుందని ఈ విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించిన సామాన్యులకు సమస్యగా మారిన ఊరుకునే ప్రసక్తి లేదని మూడు నెలల్లో మార్పు రావాలని జగన్ సీరియస్ అయినట్లు ఏసీబీ అధికారులకు చెమటలు పట్టించినట్లు సమాచారం.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: