అమరావతి కేంద్రంగా గడచిన 17 రోజులుగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఉద్యమానికి ఊపు ఇవ్వటానికి, ఉద్యమ ఖర్చుల కోసం నారా భువనేశ్వరి కూడా దీక్షలో కూర్చున్నారు. కూర్చున్నామె కూర్చుని వెళ్ళకుండా  ఉద్యమ ఖర్చుల కోసం తన చేతి గాజులు ఇస్తున్నట్లు ప్రకటించారు. పైగా తన భార్య ఇచ్చిన గాజులను వేలంపాటలో అమ్మి వచ్చిన డబ్బులను ఉద్యమానికయ్యే ఖర్చులకు వాడుకోవాలని చంద్రబాబునాయుడు బంపర్ ఆఫర్ ఇచ్చారు.

 

అంతా బాగానే ఉంది కానీ మూడు రోజులుగా భువనేశ్వరి ఇచ్చిన గాజులపైనే వివాదం మొదలైంది. ఇంతకీ ఆ వివాదమేమిటంటే  భువనేశ్వరి ఇచ్చిన గాజులు బంగారమని కొందరు కాదు కాదు ప్లాటినమని మరికొందరు ఒకటే ఊదర గొడుతున్నారు. భువనేశ్వరి గాజులు ఇచ్చింది వరకూ వాస్తవమే. కానీ ఇచ్చింది బంగారు గాజులా లేకపోతే ప్లాటినమా అన్న విషయంలోనే వివాదం పెరుగుతోంది.

 

గాజులిచ్చిన భువనేశ్వరి తాను ఇచ్చిన గాజులు బంగారమో లేకపోతే ప్లాటినమో చెప్పేసుంటే ఇపుడీ సమస్య ఉండేది కాదు.  ఆమె ఏ విషయం చెప్పకుండా సిపుల్ గా చేతికున్న గాజులు తీసి చంద్రబాబు చేతిలో పెట్టటంతోనే సమస్య మొదలైంది. పోని భార్య నుండి గాజులు అందుకున్న చంద్రబాబు అయినా ఆ గాజులు ప్లాటినమో లేకపోతే బంగారమో చెప్పుంటే సరిపోయేది. ఆయన కూడా ఆ పని చేయకుండా వేలం వేసి డబ్బులు ఉద్యమ ఖర్చుల క్రింద వాడుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు.

 

మరి చంద్రబాబు నుండి ఆ గాజులను ఎవరు తీసుకున్నారో ? వాళ్ళు వేలమే వేశారో ? లేకపోతే వేలం వేద్దామని అనుకుంటున్నారో ఏ విషయం మళ్ళీ ఎవరూ ప్రకటించలేదు.  కాబట్టి భువనేశ్వరి ఇచ్చిన గాజులను చంద్రబాబు నుండి అందుకున్న వాళ్ళు తర్వాత ఏమి చేశారనే విషయంలో  క్లారిటి లేదు. కాబట్టి గాజుల విషయంలో  క్లారిటి ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు దంపతుల మీదో లేకపోతే ఆ గాజులను అందుకున్న వాళ్ళమీదే ఉంటుంది. మరి ఎవరు చెబుతారో చూడాల్సిందే ?

మరింత సమాచారం తెలుసుకోండి: