చంద్రబాబునాయుడు ఇక నుండి భోరుమనాల్సిందేనా ? అనే అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే నెల్లూరులోని కృష్ణపట్నం పోర్టును అదాని గ్రూపు సొంతం చేసుకుంటోంది. దీనికి సంబంధించిన మార్కెట్, సాంకేతిక, ఆర్ధిక వ్యవహారాలన్నింటినీ అదాని గ్రూపు మొదలుపెట్టింది. మొత్తం వ్యవహారం 120 రోజుల్లో పూర్తి అయిపోనున్నట్లు సమాచారం.

 

ఇక్కడ గమనించాల్సిందేమిటంటే ఇప్పటి వరకూ పోర్టు నవయుగ కంపెనీ చేతిలో ఉంది. నవయుగ కంపెనీకి చంద్రబాబునాయుడుతో ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. అదే సమయంలో అదాని గ్రూపుతో కూడా చంద్రబాబుకు వ్యాపార లావాదేవీలున్నాయి.  అంటే తనకు అత్యంత సన్నిహితమైన కంపెనీ నుండి వ్యాపార లావాదేవీలుండే  మరో కంపెనీ పోర్టును కొనేస్తోంది.

 

అయితే   నవయుగ కంపెనీకి జగన్మోహన్ రెడ్డితో ఎటువంటి సంబంధాలు లేవు. అదే విధంగా అదాని కంపెనీతో జగన్ కు సన్నిహిత సంబంధాలున్నాయని చంద్రబాబు, ఎల్లోమీడియా ఒకపుడు బాగా ప్రచారం చేసింది. ఇక ప్రస్తుత విషయానికి వస్తే జగన్ దెబ్బకు అదాని గ్రూపు పెట్టుబడులు పెట్టటానికి వెనకాడి రాష్ట్రం నుండే వెళ్ళిపోయిందని ఒకటే ఊదర గొడుతున్న విషయం చూస్తున్నదే.

 

మరి చంద్రబాబు చెబుతున్నదే నిజమైతే అదాని గ్రూపు కృష్ణపట్నం పోర్టును నవయుగ నుండి ఎలా కొనుగోలు చేస్తోంది ?  కొనుగోలులో భాగంగా అదాని గ్రూపు రూ. 13,500 కోట్లు చెల్లించనుంది. అంటే వేల కోట్ల రూపాయలు అదాని గ్రూపు పెట్టుబడులు పెడుతున్నట్లే లెక్కకదా ?

 

పోర్టు డీల్ పూర్తయితే జగన్ దెబ్బకు అదాని గ్రూపు పెట్టుబడులు పెట్టటానికి వెనకాడుతోందని ఆరోపించేందుకు లేదు. నిజానికి ఏ కంపెనీ అయినా పెట్టుబడులు పెట్టటానికి ముఖ్యమంత్రిగా ఎవరున్నారు అన్నది చూడదన్న విషయం అందరికీ తెలిసిందే. వ్యాపారం, కంపెనీ, పరిశ్రమ పెట్టటానికి సదరు రాష్ట్రంలోని పరిస్ధితులు అనువుగా ఉన్నాయా లేదా ? లాభాలు వస్తాయా రావా ? అని మాత్రమే చూస్తుంది. ఇంతచిన్న విషయం కూడా తెలీకుండా నానా గోల చేస్తున్న చంద్రబాబు ప్రస్తుత డీల్ తో భోరు మనాల్సిందేనా ?

మరింత సమాచారం తెలుసుకోండి: