జనసేన పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. అయితే జనసేన పార్టీ నుండి ముఖ్య నేతలందరూ వీడుతున్నప్పటికీ రాపాక పవన్ కళ్యాణ్ కు తోడుగా ఉంటారని అందరూ అనుకున్నారు కానీ రాపాక వరప్రసాద్ తీరు మాత్రం మొదటి నుంచి పవన్ కళ్యాణ్ వైఖరికి భిన్నంగా ఉంది. అధికార పార్టీ అయిన వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను నిర్ణయాలకు సమర్థిస్తూ కీలక వ్యాఖ్యలు చేస్తూ ముందుకు సాగుతూన్నారు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్... జనసేన సోలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ భిన్నాభిప్రాయాలు తో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఎన్నో సార్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు పథకాలను సమర్థిస్తూ రాపాక  అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. 

 

 

 

 ఇకపోతే తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల నిర్ణయానికి కూడా జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మద్దతు తెలుపుతున్నారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జగన్ ప్రకటించిన మూడు రాజధానుల  నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు... ఏకంగా అమరావతిలో నిరసనలు తెలుపుతున్న రైతులకు మద్దతు తెలుపుతూ జగన్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తుంటే. రాపాక వరప్రసాద్ మాత్రం జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ చర్చనీయాంశంగా  తెర మీదికి వస్తూనే ఉన్నారు రాపాక వరప్రసాద్. 

 

 

 తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానిల నిర్ణయానికి పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని ప్రస్తావించిన  జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్... జగన్ మూడు  రాజధానిల అంశంపై ఓకే కుటుంబానికి చెందిన  అన్నదమ్ములైన చిరంజీవి పవన్ కళ్యాణ్ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు... ఒకే పార్టీలో ఉన్న ఇద్దరి మధ్య భిన్నభిప్రాయాలు ఉంటే తప్పేమిటి అంటూ వ్యాఖ్యానించారు జనసేన ఎమ్మెల్యే రాపాక. రాజధాని లతో సామాన్యుల కు సంబంధం ఉండదని... రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పడితే  రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందని రాపాక పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం రాపాక  వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: