ఫుల్లుగా చలి పెడుతుంటే ... ఓవైపు చినుకులు పడుతూ ఉంటే వేడివేడి బజ్జీలు తింటే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. ఈ కాంబినేషన్ ఎంతోమంది ఇష్టపడుతూ ఉంటారు. చల్లటి వాతావరణంలో వేడి వేడి బజ్జీలు తిని ఫుల్లుగా ఎంజాయ్ చేద్దామని ఎంతో మంది అనుకుంటారు. ఇక చల్లటి వాతావరణంలో ఎక్కడైనా  వేడి వేడి బజ్జీలు వేసి ఉండడం కనిపించింది అంటే నోరూరిపోతుంది. ఇక చుట్టుపక్కల పరిసరాలన్నీ చల్లగా ఉండాలంటే ముందు మైండ్ లో మెదిలే ఆలోచన వేడివేడి బజ్జీలు తింటే ఎంత బాగుంటుంది కదా అని వస్తుంటుంది. ఇంకేముంది అనుకున్నదే తడవుగా దగ్గర్లో బజ్జీలు వేసే బండి దగ్గరికి వెళ్లి వేడివేడి బజ్జీలు ఆరగించేస్తూ  ఉంటారు. కానీ మిరపకాయ బజ్జీలు ప్రాణాలు తీస్తాయి అంటే ఎవరైనా తింటారా. 

 

 

 మిరపకాయ బజ్జీలు ప్రాణాలు తీయడం ఏంటండి జోక్ చేస్తున్నారా  అంటారా... జోక్ కాదు ఇది నిజమే... ఇక్కడ ఓ మహిళ మిరపకాయ బజ్జిలు తినాలని అనుకుంది. ఈ క్రమంలోనే   తింటూ తింటూ మృతి చెందింది. దీంతో మిరపకాయ బజ్జీ మహిళ ప్రాణం తీసి నట్టుఅయింది. ఇంతకీ అసలు మిరపకాయ బజ్జీ ఎలా ప్రాణం తీసింది తెలియాలంటే వివరాల్లోకి వెళ్ళాల్సిందే... వేడివేడి మిరపకాయ బజ్జీలు చూస్తే నోరూర కుండా  ఉండే వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో చలికాలంలో చల్లగా ఉండే వాతావరణంలో వేడి వేడి బజ్జీలు తినడం అందరికీ ఓ మధురానుభూతిని ఇస్తుంది. 

 

 

 

 కానీ చెన్నైలో మాత్రం ఓ యువతి మిరపకాయ బజ్జీలు కారణంగా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. చెన్నై లోని కామరాజర్ నగర్ లో నివాసముండే పద్మావతి దంపతులకు పిల్లలు లేరు. వీరిద్దరికీ పెళ్ళై దశాబ్దాలు దాటిపోయినప్పటికీ ఇప్పుడు వరకు వీరికి సంతానం మాత్రం కలగలేదు. దానికి తోడు కుటుంబకలహాలు  ఈ నేపథ్యంలో పద్మావతి భర్త గంగాధర్ తో గొడవ పడి తన పుట్టింట్లోనే ఉంటుంది. అయితే పద్మావతి తల్లి వేడివేడిగా బజ్జీలు వేస్తుండడంతో జిహ్వచాపల్యం తో ఒక్కసారిగా బజ్జీలను తినే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఓ బజ్జి గొంతు లో ఇరుక్కుపోయిన ఊపిరాడక ప్రాణాలు విడిచింది ఆ మహిళ. ఆ మహిళను హుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది పద్మావతి అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: