భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన పేజీని  లిఖించుకున్న నటి శ్రీదేవి . తెలుగు ప్రేక్షకులందరికీ అతిలోక సుందరి శ్రీదేవి. ఎన్నో సినిమాల్లో నటించి తనదైన నటనతో ఎంతోమంది అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది శ్రీదేవి . తన అందం అభినయంతో అతిలోక సుందరి అంటే శ్రీదేవి లాగే ఉంటుందేమో అని  తెలుగు ప్రేక్షకులు భావించేంతగా  ప్రభావితం చేసింది శ్రీదేవి. శ్రీదేవి మరణించినప్పటికీ ఇప్పటికీ శ్రీదేవి ని నటనను  స్మరించుకుంటూ ఉంటారు చాలా మంది. అయితే భాషతో సంబంధం లేకుండా ఎక్కడ అడుగుపెడితే అక్కడ అగ్ర స్థానం పొందిన హీరోయిన్ శ్రీదేవి . అయితే శ్రీదేవి  అత్యంత విషాదకర పరిస్థితుల్లో కన్నుమూయడం అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు విషయం తెలిసిందే. అయితే బాత్ టబ్ లో  పడి ఆమె చనిపోయింది అని తెలిసినప్పటికీ ఇప్పటికీ ఆమె మృతిపై ఎన్నో అనుమానాలు కూడా వున్నాయి. 

 

 

 ఇప్పటికీ ఆమె మృతిపై స్పష్టత రాలేదు. అయితే శ్రీదేవి జీవిత కథ రాసిన సత్యార్థ నాయక్ శ్రీదేవి మరణం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవికి లోబీపీ ఉందని ఆ కారణంగానే బాత్రూం లో కళ్ళు తిరిగి పడిపోయారు  అంటు  తెలిపారు. శ్రీదేవి రక్తపోటు సమస్యతో బాధ పడుతున్న విషయాన్ని శ్రీదేవి మేనకోడలు మహేశ్వరి కూడా నిర్ధారించింది సత్యర్థ్  నాయక్ చెప్పుకొచ్చారు. ఉదయం నడక సందర్భంగా శ్రీదేవి ఎన్నోసార్లు లోబీపీ కారణంగా పడిపోయినట్లు బోనికపూర్ సైతం చెప్పిన విషయాన్ని సత్యరాజ్ నాయక్ వెల్లడించారు. శ్రీదేవి సినిమా  షూటింగ్ సమయంలోను  ఎన్నోసార్లు లో బిపి తో  బాధ పడిన విషయాన్ని హీరో నాగార్జున దర్శకుడు పంకజ్ పరాశర్  కూడా తెలిపినట్లు వివరించారు సత్యార్థ నాయక్.

 

 

 అయితే రెండేళ్ల కిందట దుబాయ్ లో  బంధువుల పెళ్లి కోసం వెళ్లిన శ్రీదేవి అక్కడే ఓ స్టార్ హోటల్లో బాత్ టబ్ లో  పడి మరణించిన విషయం తెలిసిందే. బాత్ టబ్ లోనే  శ్రీదేవి విగతజీవిగా మారిపోయారు. అయితే శ్రీదేవి మరణించి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ శ్రీదేవి భర్త బోనీకపూర్ మాత్రం ఇప్పటికీ తన భార్య శ్రీదేవి మృతి నుంచి కోలుకోలేదు. ఇటీవలే తెలుగు గడ్డపై జరిగిన ఓ ఫంక్షన్ కి హాజరైన బోనీకపూర్ శ్రీదేవి ప్రస్తావన రాగానే కన్నీటిపర్యంతమై కనీసం మాట్లాడలేకపోయారు కూడా. అభిమానులు కూడా ఇప్పటికే శ్రీదేవి  నటనను గుర్తుచేసుకుంటూనే  ఉంటారు. శ్రీదేవి మరణం అభిమానులకు తీరని లోటు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: