ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తుందని తన వాహనాన్ని ఆపేశారు అంటూ  పవన్ కళ్యాణ్ విమర్శలు  విషయం తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తుంటే ఎవరి వాహనాలైన ఆపుతారు అంటూ మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. అది నా వాహనమైన,  పవన్ కళ్యాణ్ ఒకటేనని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సీఎం వెళ్తుంటే తన కారును ఆపారు అని పవన్ కళ్యాణ్ చెప్పడం విడ్డూరంగా ఉంది అంటూ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. తాజాగా మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ... పోలీసుల దృష్టి లో ఎవరైనా ఒకటే  అంటూ చెప్పుకొచ్చారు

 

 

 ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్నో చర్యలు చేపట్టిందని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. అమరావతి అభివృద్ధి చేపట్టాలంటే 1.10 లక్షల కోట్లు అవసరమని... 1.10 లక్షల కోట్లను  ఒకే ప్రాంతంలో ఖర్చు చేసి రాజధాని నిర్మించాలని తమ ప్రభుత్వం భావించడం లేదని వ్యాఖ్యానించారు ఆయన. ప్రభుత్వం ముందు పోలవరం ప్రాజెక్టును సత్వరంగా  పూర్తి చేసి  రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లాల్సిన బాధ్యత లు ఉన్నాయి అంటూ తెలిపిన మంత్రి బొత్స సత్యనారాయణ... కడపలో ఉక్కు పరిశ్రమ కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని చెప్పుకొచ్చారు. కమీషన్ల కోసం కక్కుర్తిపడే చంద్రబాబుల తమ ప్రభుత్వం లేదని విమర్శలు గుప్పించారు మంత్రి బొత్స సత్యనారాయణ. 

 

 

 

 పోలవరం ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్ కు వెళ్లడం ద్వారా 15 శాతం తక్కువ ఖర్చుతోనే పనులు జరిగి పోయే పరిస్థితి వచ్చిందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. కానీ చంద్రబాబు మాత్రం రివర్స్ టెండరింగ్ పై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు అంటూ విమర్శించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహనం కోల్పోయి మాట్లాడాలి అనుకుంటే ఇంట్లోనే కూర్చోవాల్సి వస్తుంది అని.. సినిమాల్లో ఘింకారాలు  చేసినట్లుగా ఇక్కడ రాజకీయాల్లో  చేస్తే అవన్నీ సహించేందుకు ఎవరూ సిద్ధంగా లేరు అంటూ నిప్పులు చెరిగారు మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక పాలసీ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలు అర్థరహితమని... టిడిపి నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ ను ఆయన చదువుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు ఇసుకను డోర్ డెలివరీ చేస్తున్నామంటూ చెప్పారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటారని బొత్స సత్యనారాయణ తెలిపారు

మరింత సమాచారం తెలుసుకోండి: