ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణది ఉత్తరాంధ్రలో తిరుగులేని రాజకీయ కుటుంబం. ఫ్యామిలీ నుంచి ఎంత మందికి టికెట్లిచ్చినా.. ఒంటి చేత్తో గెలిపించుకోగల సత్తా ఆయనకు ఉంది. కానీ ఆయన కుటుంబానికి స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు పెద్ద షాకే ఇచ్చాయి. 

 

ఉత్తరాంధ్రకు మకుటం లేని మహారాజుగా ఉన్న నేత బొత్స సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో కీలకమైన మున్సిపల్ శాఖ ఆయన చేతుల్లోనే ఉంది. తనకు పదవులే కాదు.. నమ్ముకున్న వాళ్లకు కూడా పదవులు వచ్చేలా చేయడం బొత్సకు తెలుసు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు భార్యను ఎంపీగా, సోదరుడిని ఎమ్మెల్యేగా, మరో బంధువును ఎమ్మెల్యేగా ఒంటిచేత్తో గెలిపించిన చరిత్ర ఉంది. కానీ వైసీపీలోకి వచ్చాక మాత్రం బొత్సకు షాక్ లు తగులుతున్నాయి. 
 

2019 ఎన్నికల్లో సైతం తమ ఇంటి నుండి ముగ్గరు అసెంబ్లీలో బరిలో, బార్య ఝాన్సీని   పార్లమేంట్ బరిలో దించాలని బొత్స ప్లాన్ వేశారు.  కానీ సాధ్యం కాలేదు. అధిష్ఠానం ఒత్తిడితో ఎంపీగా బొత్స అనుచరుడు బెల్లాన చంద్రశేఖర్ ను దించాల్సి వచ్చింది.  తన భార్య ఝాన్సీకి ఎలాంటి పదవి లేకుండా పోయింది. కనీసం స్థానిక స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా భార్య ఝాన్సీకి కానీ.. మేనల్లుడు శ్రీనివాస్ కి కానీ జెడ్పీ ఛైర్మన్ పదవి ఇప్పించాలని బొత్స అనుకున్నారు. కానీ ప్రభుత్వ నోటిఫికేషన్ తో పెద్ద షాకే తగిలింది.  

 

నోటిఫికేషన్ లో విజయనగరం జెడ్పీ ఛైర్మన్ పదవి.. ఎస్సీ ఉమెన్ కు రిజర్వ్ అయింది. దీంతో బొత్స కుటుంబం షాకైంది. ఇప్పటికిప్పుడు వైసీపీ నుండి జెడ్పీ చైర్మన్ కి సరిపడా షెడ్యూల్ కులాల మహిళలెవరున్నారా అని వెతుకుతున్నారు వైసీపీ నేతలు. తాజా పరిణామంతో అనుకున్నది ఒకటి  అయింది మరొకటి అంటూ వాపోతున్నారట బొత్స అనుచరులు. కనీసం విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్ మొదటి మేయర్ పదవి అయినా ఝాన్సీకి దక్కాలని ఆశగా ఎదురుచూస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: