ప్రభుత్వం శనివారం మున్సిపాలిటీలకు సంబంధించిన వార్డుల రిజర్వేషన్‌ కోటాను ప్రకటించింది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా.. సత్తుపల్లి 23, మధిర 22, వైరాలో 20వార్డుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అయితే ఆదివారం ఏ వార్డు ఎవరికి రిజర్వు అయిందనే అంశాన్ని  ప్రకటించే అవకాశం ఉంది. వీటితోపాటు మున్సిపల్‌ చైర్మన్‌ రిజర్వేషన్లను కూడా ప్రకటిస్తారని భావిస్తున్నారు.మున్సిపాలిటీల పరిధిలో  ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించడంతో ఎన్నికల సందడి ప్రారంభంకానున్నది. ఇప్పటివరకు వార్డులు, మున్సిపల్‌ చైర్మన్‌ పదవులకు రిజర్వేషన్‌ ప్రకటించకపోవడంతో ఆశావహులు ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. ప్రస్తుతం వార్డుల రిజర్వేషన్లు ప్రకటించగా.. ఆదివారం వార్డులవారీగా రిజర్వేషన్లు, చైర్మన్‌ పీఠం ఎవరికి రిజర్వు అయిందనే అంశాలు కూడా తేలే అవకాశం ఉంది. దీంతో  తమవంతు ఆశావహులు టికెట్ల కోసం ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయనున్నారు. 


రాష్ట్ర ప్రభుత్వం సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపాలిటీల్లోని వార్డులకు సంబంధించిన రిజర్వేషన్ల వివరాలను  ప్రకటించింది. అయితే మున్సిపాలిటీ యూనిట్‌గా రిజర్వేషన్ల ప్రక్రియను ప్రకటించారు. 23 వార్డులకుగాను  ఆ ప్రకారం సత్తుపల్లిలో.. ఎస్టీ జనరల్‌కు  ఒక వార్డు కేటాయించారు. ఎస్సీలకు మూడు..  ఎస్సీ జనరల్ రెండు వార్డులు , ఎస్సీ మహిళకు  ఒక వార్డు కేటాయించారు. బీసీలకు 7 సీట్లు కేటాయించగా.. 4 బీసీ జనరల్‌కు, 3 బీసీ మహిళకు కేటాయించారు. మహిళలకు 7 వార్డులు కేటాయించగా.. 5 సీట్లు జనరల్‌కు కేటాయించారు. 22 వార్డులు  మధిర మున్సిపాలిటీలో ఉండగా..  ఒక వార్డు ఎస్టీ జనరల్‌కు కేటాయించారు.  6 వార్డులు ఎస్సీలకు.. మూడు వార్డులు ఎస్సీ జనరల్‌కు, 3 ఎస్సీ మహిళకు కేటాయించారు. బీసీలకు 4 సీట్లు కేటాయించగా.. 2 బీసీ జనరల్‌కు, 2 బీసీ మహిళలకు రిజర్వు చేశారు. మహిళలకు 6 వార్డులు రిజర్వు చేయగా.. జనరల్‌కు 5 వార్డులు కేటాయించారు. 

 

వైరాలో 20 వార్డులు ఉండగా.. ఒక వార్డు ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. ఎస్సీలకు 5 వార్డులు కేటాయించగా.. 3 ఎస్సీ జనరల్‌కు, 2 వార్డులు ఎస్సీ మహిళలకు రిజర్వు చేశారు. బీసీలకు 4 వార్డులు రిజర్వు చేశారు. వీటిలో 2 బీసీ జనరల్‌కు, 2 వార్డులు బీసీ మహిళలకు కేటాయించారు. 6 జనరల్‌ మహిళకు, 4 జనరల్‌కు కేటాయించారు. మూడు మున్సిపాలిటీల్లో ఒక్కో సీటును ఎస్టీలకు కేటాయించారు. 

 

ప్రభుత్వం   ప్రకటించిన రిజర్వేషన్లలో 50 శాతం వార్డులను మహిళలకు కేటాయించారు.  మొత్తం 23 వార్డులు సత్తుపల్లిలో ఉండగా..  మహిళకు కలిపి 11 వార్డులు ఎస్సీ, బీసీ జనరల్‌ కేటాయించారు. అలాగే మధిరలో 22 వార్డులకు గాను.. 11 వార్డులు ఎస్సీ, బీసీ, జనరల్‌ మహిళకు కేటాయించారు. వైరాలో 20 వార్డులకు గాను.. 10 వార్డులు ఎస్సీ, బీసీ, జనరల్‌ మహిళకు రిజర్వు చేశారు. దీంతో ప్రతి మున్సిపాలిటీలోనూ మహిళా ప్రాతినిధ్యం 50 శాతం ఉండనున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: