సమాజంలో ప్రజెంట్ యువత తమకి ఏది అనిపిస్తే అది చేస్తున్నారు. ఏ విషయాలలో కూడా పెద్ద వాళ్ళ సలహాలు తీసుకోకుండా చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. చదువులో గాని పెళ్లి విషయంలో గాని ఇంకా జీవితానికి సంబంధించి అతి ముఖ్యమైన విషయాల్లో గాని ఎక్కడ కూడా తల్లిదండ్రుల మాటకు విలువ ఇవ్వకుండా గౌరవం ఇవ్వకుండా తమకి నచ్చిన దాన్ని చేసుకుంటూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అంతే కాకుండా అనవసరమైన విషయాలలో సమాజంలోకి వెళ్లి తల్లిదండ్రులకు భారం గా మారుతున్నారు. ముఖ్యంగా చెడు అలవాట్లకు బానిస అయ్యి చాలా నీచంగా కుటుంబంలో వ్యవహరిస్తున్నారు. తల్లిదండ్రుల మాట పట్టించుకోకుండా తిరగబడే వారిగా ప్రస్తుత యువత సమాజంలో తయారవుతున్నారు.

 

టెక్నాలజీ మాయలో పడి లేని బతుకుని ఉన్న బతుకు గా అనవసరమైన బడాయిలకు పోతూ తల్లిదండ్రుల కష్టాలకు కారకులు అవుతున్నారు.  ఒకానొక సమయంలో అప్పట్లో ఉన్న యువకులు తల్లిదండ్రులంటే చాలా విలువ ఇచ్చే వాళ్ళు వృద్ధాప్యము కొస్తే పిల్లలు తల్లిదండ్రులను ఇంటిలోనే వాళ్లకి అన్ని పనులు చేసే విధంగా ఒకరిని వాళ్ల దగ్గర పెట్టి చాలా అద్భుతంగా వారి రుణం తీర్చుకునే వాళ్ళు. అయితే ప్రస్తుతం మాత్రం ఉన్న యువకులు మరియు యువతులు ఎవరు కూడా కనీసం కుటుంబ విలువలకు లెక్క ఇవ్వకుండా గౌరవం ఇవ్వకుండా బయట వ్యక్తులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఇంటిలో విలువైన తల్లిదండ్రుల ఆలోచనలను పక్కనపెట్టి నాలుగు మూడు సంవత్సరాలు పరిచయం ఉన్న వ్యక్తులు ఆలోచనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కనీసం తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా యువతీ యువకులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు.

 

ముఖ్యంగా వృద్ధాప్యానికి వచ్చిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ వారికి విలువ ఇవ్వకుండా వాళ్ళ ని వృద్ధాశ్రమంలో చేర్పించి చేతులు దులిపేసుకుంటూన్నారు. ఏది ఏమైనా ఎంతో అనుభవం మరియు జీవితాన్ని చూసిన పెద్దవాళ్ళు ఆలోచనలకు వాళ్ల అనుభవానికి తగ్గ రీతిలో ఇచ్చే సూచనలకు యువత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే కచ్చితంగా జీవితం బాగుపడుతుందని ఉన్నత స్థాయికి వెళ్ళటం గ్యారెంటీ అని పెద్దలు కోరుకుంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: