ఇటీవ‌ల టిక్‌టాక్ ప్ర‌భావం జ‌నాల పై ఎంత‌లా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. అటు సెల‌బ్రెటీల ద‌గ్గ‌ర నుంచి మాములు  జ‌నం వ‌ర‌కు ఎవ్వ‌రిని చూసినా టిక్ టాక్ వీడియో చెయ్య‌ని వారు ఉండ‌రు. ఈ టిక్ టాక్ చేసేవాళ్ళకి మ‌ళ్ళీ ప్ర‌త్యేకించి ఫ్యాన్స్ కూడా సోష‌ల్ మీడియా అంతా ఇదో పెద్ద వైర‌ల్ అయిపోయింది. ఈ టిక్‌టాక్ సాధ‌ర‌ణ ప్ర‌జ‌లే కాక‌, ఇటు రాజ‌కీయనాయ‌కులు, సినీ సెల‌బ్రెటిలు ఒక్క‌రేంటి ప్ర‌తి ఒక్క‌రూ దీనికి పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు. అయిపోవ‌డం మాత్ర‌మే కాదు ప్ర‌తి ఒక్క‌రు ఒక వీడియో తీసి టిక్‌టాక్ పెట్టేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇటీవ‌లె ఈ టిక్‌టాక్ పైన ఒక సినిమాలోని హీరోయిన్ పాత్ర‌ను కూడా సృష్టించాడు ద‌ర్శ‌కుడు మారుతి. ప్ర‌తిరోజూ పండ‌గే చిత్రంలో హీరోయిన్‌కి టిక్‌టాక్ పిచ్చి ఉంటుంది.  

 

మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ ఒక నాయకురాలు జగన్ పాట మీద టిక్ టాక్ చేసి వీడియోని అప్లోడ్ చేసింది. ఈ వీడియో ఎంతో మంది నెటిజన్లను ఆకర్షించింది. ఇదే నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలోని ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన అద్భుత ఫీట్‌కు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది. నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఒంటి చేత్తో రెండు బంతులను గాల్లోకి ఎగరేస్తూ, వాటిని కంట్రోల్ చేస్తూ అందుకునే ఫీట్ చేశారు. అంతే కాదు ఆ ఫీట్ చేస్తూ దీనికి తగినట్టుగా ఓ పాటను కూడా జోడించి టిక్ టాక్ వీడియో చేశారు ఆ‍యన అభిమానులు. ఆ ఫీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అందరినీ ఆకట్టుకుంటుంది. 

 

'అనుకుంటే సాధించనిది ఏమున్నది.. మనిషి అనుకుంటే సాధించనిది ఏమున్నది' అంటూ బ్యాక్‌గ్రైండ్‌లో వస్తున్న సాంగ్ మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.  నల్లగొండ ఎమ్మెల్యేగా గెలవడమే తన జీవితంలో అత్యంత సంతోషకరమైన ఘటన అని గతంలో మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ కంచర్ల భూపాల్ రెడ్డి చెప్పారు. అనంతరం ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి ప్రజలందరితో పంచుకున్నారు. ఆ‍యన చిన్నతనంలో రోడ్డు ప్రమాదం జరిగి చేయి విరిగిందని, ఆస్పత్రికి వెళ్తే డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా చెయ్యిని తొలగించారని తెలిపారు. అప్పుడు తనకు మొదటి సారి చాలా బాధ కలిగిందన్నారు. ఇక రెండోసారి తనకు పుట్టిన కూతురు నడవలేదని తెలిసినప్పుడు కూడా చాలా బాధ కలిగిందని ఆయన మీడియాతో పంచుకున్నారు. కానీ ఎలా ఉన్న‌ప్ప‌టికీ ఆశ‌యం ఉంటే ఏదైనా సాధించ‌వ‌చ్చు అన్న‌ట్లు ఉంది ఈయ‌న వీడియో సింగిల్ హ్యాండ్‌తో రెండు బంతుల‌ను ఎక్క‌డా మిస్ కాకుండా క్యాచ్ ప‌డుతూ ఎంతో అద్భుతంగా కంట్రోల్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: