ఇటీవల పాకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి సిక్కుల తొలి గురువు గురునానక్ జన్మస్థలమైన నాన్‌కానా సాహెబ్ గురుద్వారాపై దాడిని మరువక ముందే మరో దారుణ ఘటన జరిగి కలకలం రేపుతోంది. పాకిస్తాన్ లోని పెషావర్‌లో సిక్కు వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు హతమార్చినట్టు అక్కడి మీడియా చెబుతుంది. 

 

వివరాల్లోకి పోతే, ఒక స్థానిక పాకిస్తానీ సిక్కు న్యూస్‌ రిపోర్టర్ హర్మీత్ సింగ్ యొక్క సోదరుడు రవీందర్ సింగ్‌ను పెషావర్‌లో కాల్చి చంపినట్లు పోలీసులు శనివారం తెలిపారు.

 

రవీందర్ సింగ్ తన పెళ్లికు సంబంధించిన వస్త్రాలను షాపింగ్ చేయడానికి షాంగ్లా నుండి పెషావర్ కు వచ్చాడు. అయితే, కొందరు గుర్తు తెలియని నిందితులు రవీందర్ సింగ్ ఫోన్ నుండి కాల్ చేసి వారు తన సోదరుడిని చంపి, మృతదేహాన్ని పెషావర్ లోని చంకని ప్రాంతంలో విసిరినట్లు హర్మీత్ సింగ్ కు చెప్పారు.

 

శనివారం రాత్రి రవీందర్ సింగ్ నంబర్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని చమకని పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ దాఖలు చేస్తున్న సమయంలో ఓ పోలీసు అధికారి తవీందర్ సింగ్ కి చెప్పారు. దాంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. గుర్తుతెలియని నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని మృతుడి కుటుంబానికి అందజేశారు.

 

 

రవీందర్ సింగ్ కు మలేషియాలో వ్యాపారం ఉందని, ఆయన ఇటీవల పాకిస్థాన్‌కు వచ్చారని పోలీసులు తెలిపారు. రవీందర్ సింగ్ వివాహం వచ్చే వారం నిర్ణయించబడింది. అందుకే అతను షాపింగ్ కోసం పెషావర్ లో ఉన్నాడు. రవీందర్ సింగ్ పెషావర్ ప్రయాణం గురించి కొద్ది మందికి మాత్రమే తెలుసునని పోలీసులు తెలిపారు.

 

సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ (ఆపరేషన్స్) జహూర్ బాబర్.. బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ నేరానికి పాల్పడిన నిందితులను త్వరలోనే కనుగొంటామని రవీందర్ సింగ్ కుటుంబానికి ఆయన చెప్పారు.

 

తన సోదరుడి హత్యతో ఆగ్రహించిన హర్మీత్, "మైనారిటీలు లేకుండా, ఏ దేశం అభివృద్ధి చెందదు, ఇంకా పురోగతి సాధించదు. మైనారిటీల కారణంగా పాకిస్తాన్ బ్యూటిఫుల్ గా ఉంది, కానీ ప్రతి సంవత్సరం, మేము చనిపోయినవారిని మా భుజాలపై మోసుకువెళ్తున్నాం. పాకిస్తాన్, మైనారిటీలను రక్షించడానికి అనేక దేశాల నుండి భారీగా నిధులు పొందుతుంది.

 

కానీ ఆ మైనారిటీలకు ఎటువంటి రక్షణ లేదు. అందుకే ఈ రోజు నా చనిపోయిన సోదరుడి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి నేను ఇక్కడ ఉన్నాను. పాకిస్తాన్ ప్రభుత్వం నిందితులను పట్టుకునే వరకు నేను విశ్రాంతి తీసుకోను.' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: