డిసెంబర్ నెలలో ఆస్ట్రేలియా లో చెలరేగుతున్న బుష్‌ఫైర్‌ని ఆర్పేందుకు వెళ్లిన ఒక అగ్నిమాపక దళ అధికారి దురదృష్టవశాత్తు మృత్యువాత పడ్డారు. అయితే, అతని కుమారుడైన 19 నెలల హార్వీ కీటన్ కు ఫాథర్'స్ పోస్తుమౌస్ (తన తండ్రి ధైర్యాన్ని గౌరవించే) అవార్డును సమర్పించారు. ఆస్ట్రేలియాలో బుష్ ఫైర్ లో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన జాఫ్రీ కీటన్ యొక్క చిన్న కుమారుడు హార్వీ కీటన్ ఈ అవార్డును అందుకున్నాడు.

 

అగ్నిమాపక సిబ్బంది దుస్తులలో, నోటిలో పాసిఫైయర్‌తో ధరించిన ఈ బాలుడు న్యూ సౌత్ వేల్స్ (ఎన్‌ఎస్‌డబ్ల్యు) గ్రామీణ అగ్నిమాపక సేవా కమిషనర్ షేన్ ఫిట్జ్‌సిమ్మన్స్ నుండి పతకాన్ని అందుకున్నాడు. నివేదికల ప్రకారం, అతని 32 ఏళ్ల తండ్రి, అతని సహోద్యోగి ఆండ్రూ ఓ'డ్వైర్ గత నెలలో మంటలతో పోరాడుతూ మరణించారు. వారి వాహనంపై చెట్టు పడటంతో వారు మృతి చెందారు. 

 

 

కీటన్ అంత్యక్రియల చిత్రాలను న్యూ సౌత్ వేల్స్ ఫైర్ సర్వీస్ వారి ఫేసుబుక్ పేజీలో పోస్ట్ చేసారు.  "ఈ రోజు NSW RFS కుటుంబం వారిలో ఒకరికి వీడ్కోలు చెప్పింది" అని పోస్ట్ లో పేర్కొన్నారు. పశ్చిమ సిడ్నీలో జరిగిన అంత్యక్రియలకు వంద మందికి పైగా హాజరయ్యారు. కీటన్ కు గౌరవ రక్షకు కూడా ఇవ్వబడింది. అలాగే, మిస్టర్ కీటన్ శవపేటికకు వందనం చేయడానికి డజన్ల కొద్దీ అగ్నిమాపక సిబ్బంది గౌరవ రక్షక దళాన్ని ఏర్పాటు చేశారు.

 

 

పశ్చిమ సిడ్నీలో గురువారం జరిగిన కీటన్ అంత్యక్రియల సేవ యొక్క అనేక చిత్రాలను న్యూ సౌత్ వేల్స్ ఫైర్ సర్వీస్ వారి ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసింది. అగ్నిమాపక సేవ యొక్క ఫేసుబుక్ పోస్ట్ ను చూసిన చాలా మంది ప్రజలు కీటన్ కు, ప్రాణాలు కోల్పోయిన మిగతా వారందరికీ నివాళులర్పించారు.

సెప్టెంబర్ నుంచి మొత్తం 18 మంది మంటల్లో ప్రాణాలు కోల్పోయారు. 5.25 మిలియన్ హెక్టార్ల (13 మిలియన్ ఎకరాల) భూమి మంటల్లో కాలిపోయింది. ఎన్‌ఎస్‌డబ్ల్యు రాష్ట్రంలోనే దాదాపు 1,500 గృహాలు ధ్వంసమయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: