అసెంబ్లీకి వచ్చినప్పుడు నుంచి ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ నేతలు అందరూ జగన్ సర్కార్ పై ఎన్నో ఆరోపణలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు టిడిపి నేతలు. జగన్మోహన్రెడ్డి సర్కార్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ దళితులు టిడిపి నేతలపై దాడులకు పాల్పడుతోంది అంటూ ఆరోపిస్తున్నారు. ఎంతో మంది వైసీపీ బాధితులు తమ ను కలిసి కాపాడాలని వేడుకుంటున్నారు అని... టిడిపి కార్యకర్తలపై దాడులు తగవు అంటూ హెచ్చరిస్తున్నారు

 

 అంతేకాకుండా టిడిపి సానుభూతిపరులు అంటు  చాలా మంది ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు . ఇప్పటికే ఎంతో మంది ఉద్యోగులను  ఉద్యోగాలు మానేయాలని దాడులకు సైతం వైసీపీ నేతలు పాల్పడ్డారని టిడిపి నేతలందరూ  ఆరోపణలు చేస్తూ అధికార వైసిపి పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. టిడిపి సానుభూతిపరులు అంటూ  దళిత ఉద్యోగులపై దాడులు చేయడం తగదు అంటూ తెలుపుతున్నారు. ఇకపోతే తాజాగా టిడిపి మాజీ మంత్రి ఎమ్మెల్సీ నారా లోకేష్ జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నో కష్టాలను అధిగమించి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన దళిత అధికారులపై అధికార వైసీపీ నేతలు అందరూ దాడులకు పాల్పడుతున్నారని చిత్రహింసలకు గురి చేస్తున్నారని టిడిపి నేత నారా లోకేష్ ఆరోపించారు. 

 


 దళిత ప్రభుత్వ ఉద్యోగులపై వైసీపీ నేతల దాడులు చేయడం దారుణమని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా ములకలచెరువు ఎంపీడీవో రమేష్ పై వైసీపీ నేతలు దాడి చేయడం హేయమైన చర్య అంటూ విమర్శించారు  నారా లోకేష్. గ్రామాల్లో వైసీపీ నాయకుల అరాచకాలు తారాస్థాయికి చేరుకున్నాయి అంటూ విమర్శలు చేశారు నారా లోకేష్. వైసీపీ నేతలు  చేసే తప్పుడు పనులకు సహకరించాలి అంటూ అధికార పార్టీ నాయకులు అందరూ ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు నారా లోకేష్. సహకరించని  వారికి వైసీపీ నేతలు దుర్భాషలాడుతూ దాడులకు పాల్పడుతున్నారని...  వైసీపీ నేతల తీరును తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు నారా  లోకేష్ . ఈ రాష్ట్రంలో అధికారులకే  రక్షణ లేనప్పుడు ఇక ప్రజలకు ఎక్కడ రక్షణ ఉంది అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: