టిడిపి పార్టీ 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత టీడీపీ నేతల్లో అలజడి  నెలకొంది. అసలు టిడిపి పార్టీ భవిష్యత్తు ఏంటో అర్థం కాని పరిస్థితి నెలకొందని పలువురు టీడీపీ నేతలు భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే కోణంలో ఆలోచిస్తు  ఇతర పార్టీల వైపు ఆశగా చూస్తున్నారు టీడీపీ నేతలు. ఇప్పటికే ఎన్నో ఏళ్ల నుంచి టిడిపిలో ఉన్న కీలక నేతలు అందరూ పార్టీని వీడారు కూడా. నలుగురు రాజ్యసభ సభ్యులు ఏకంగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు... మరో కీలక నేత అయిన టిడిపి యువత విభాగం అధ్యక్షుడు దేవినేని అవినాష్ అధికార పార్టీలో చేరి చంద్రబాబుకు భారీ షాక్ ఇచ్చారు. అంతే కాకుండా ఇంకా కొంతమంది నేతలు టిడిపిని వీడేందుకు  సిద్ధంగా ఉన్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

 


 ఇక టీడీపీ లోనే రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ టీడీపీ లోకి కీలక నేతగా మారిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా  టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించి టిడిపి పార్టీ సభ్యత్వం కి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వంశీ రాజీనామా ఆంధ్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. అయితే వల్లభనేని వంశీ రాజీనామా చేసిన అనంతరం వైసీపీ పార్టీలో చేరుతారని అందరూ అనుకున్నారు. అయితే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ పార్టీలో చేరడం ఖాయం అయినప్పటికీ ఇప్పుడు వరకు వైసిపి తీర్థం మాత్రం తెచ్చుకోలేదు వల్లభనేని వంశీ. 

 


 ఇకపోతే టిడిపి పార్టీ పరిస్థితి ఏంటి అన్నది అర్థం కాని పరిస్థితి నెలకొంది. టిడిపి పార్టీ నుంచి వరుసగా నేతలందరూ పార్టీని వీడుతూ వేరే పార్టీ వైపు మొగ్గు చూపడంతో చంద్రబాబుకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి . ఈ నేపథ్యంలో టీడీపీ కీలక నేత అయిన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తో భేటీ కావటం  ఆంధ్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అనంతపురం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో సత్య కుమార్ ను జేసీ కలిసి మాట్లాడారు. అయితే తాజాగా దీనిపై జెసి స్వయంగా వివరణ ఇచ్చారు. సత్య కుమార్ తనకు  మిత్రుడు కావడంతోనే కలిశానని వెల్లడించారు జేసీ . బీజేపీ నేతలతో సమావేశానికి పెద్దగా ప్రాధాన్యం లేదని అన్నారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదని ప్రాంతీయ పార్టీలు  ఉన్నంత వరకు టీడీపీ లోనే ఉంటాను అంటూ స్పష్టం చేశారు. పిఓకే ను  భారత్ ఆక్రమిస్తే బీజేపీలో చేరుతానని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు జేసీ .

మరింత సమాచారం తెలుసుకోండి: