చెన్నైలోని మీనంబాక్కం మెట్రో రైల్వే స్టేషన్ ద్వారా ప్రతిరోజు రెండువేల 500 మంది ప్రయాణికులు తమ పనుల నిమిత్తం వెళ్తుంటారు. ఈ మెట్రో రైల్వే స్టేషన్ లో 200 నుంచి 250 వరకు వాహనాలను పార్క్ చేసుకోవడానికి సౌకర్యం ఉంటుంది. పెమ్మాళ్, పల్లవరం, చిరోంపెట్ లకు చెందిన వందలమంది ప్రయాణికులు వారి వాహనాలను ఎయిర్ పోర్ట్ మెట్రో వద్ద పార్క్ చేసి మెట్రో ట్రైన్ అని ఎక్కి వెళ్తుంటారు.

 

కానీ ఆ ఎయిర్ పోర్ట్ వద్ద ప్రయాణికుల రద్దీ ఎక్కువైనప్పుడు... చాలామంది ప్రయాణికులు సమీపంలోనున్న మీనంబాక్కం మెట్రో రైల్వే స్టేషన్ వద్దకు వచ్చి తమ బైకులను పార్క్ చేస్తుంటారు. అలా వచ్చే ప్రయాణీకులు మా వాహనాలను పార్క్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే మీనంబాక్కం రైల్వే స్టేషన్ అధికారిక నిర్వాహకులు రెండంతస్థుల బైక్ పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.


అయితే, ప్రస్తుతం ఈ సౌకర్యాన్ని కేవలం టెస్టింగ్ కోసం ఏర్పాటు చేశారు. టెస్టింగ్ లో భాగంగా 5 బైకులను పార్కింగ్ చేసే విధంగా 9 అడుగుల ఎత్తులో రెండంతస్తుల బైక్ పార్కింగ్ ఫెసిలిటీ ని ఏర్పాటు చేశారు. దీనిని మీనంబాక్కం రైల్వేస్టేషన్ సంస్థ డైరెక్టర్ నరసింహ ప్రసాద్ ప్రారంభించారు. ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ ఫెసిలిటీ ద్వారా క్రమక్రమంగా 20 బైకులను పార్క్ చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నామని ఆ సంస్థ అధికారి చెప్పారు. ఈ 9 అడుగుల ఎత్తులో మోటార్ సైకిళ్లను పార్క్ చేసినప్పుడు గాలి ఏ విధంగా వస్తుందో... ఆ గాలి వలన ఈ బైకులు పడిపోకుండా ఉంటాయో లేదో అని కొన్ని రోజులపాటు పరీక్షించి.. ఏదైనా సమస్యలు ఎదురైతే వాటిని ఫిక్స్ చేస్తామని ఆ సంస్థ డైరెక్టర్ చెప్పారు.

 

ఒకవేళ ఈ రెండు అంతస్తుల బైక్ పార్కింగ్ సజావుగా సాగితే... ఇతర రైల్వే స్టేషన్లలో కూడా ఇటువంటి బైక్ పార్కింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు ఆ సంస్థ అధికారులు. ఇంతకీ బైక్లను రెండంతస్తుల పైకి ఎలా తీసుకెళ్తారు అంటే... హైడ్రాలిక్ విధానం ద్వారా. అలాగే వీటిని గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించి గ్రౌండ్ ఫ్లోర్ కి తీసుకొస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: