జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా భారీ కుట్రనే జరుగుతోంది.  జగన్ ను గబ్బు పట్టించటానికి మరీ నీచంగా ఆయన రాజకీయ ప్రత్యర్ధులు బాగా దిగజారిపోయారు. జనవరి 3వ తేదీన మూడు రాజధానులపై అధ్యయనం చేసి రిపోర్టు అందచేసిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు (బిసిజి) పేజిని వికిపీడియాలో  12 సార్లు మార్చి తప్పుడు ప్రచారం చేశారు.

 

బిసిజి తన నివేదికను 3వ తేదీ ఇవ్వగానే నెటిజన్లు సంస్ధ విశ్వసనీయతను తెలుసుకునేందుకు వికిపీడియాను ఆశ్రయించారు. ఆ విషయం ముందుగానే గ్రహించిన ప్రత్యర్ధులు వెంటనే  వికిపీడియాలో బిసిజికి సంబంధించిన వివరాలను రెండు రోజుల్లో 12 సార్లు మార్చారు. అంటే వికిపీడియా పేజిలో నెటిజన్లు ఇతరుల కోసం తమకు తెలిసిన సమాచారాన్ని అప్ లోడ్ చేయవచ్చు లేకపోతే మార్చవచ్చు కూడా.

 

అంటే నెటిజన్లు వికీపీడియా పేజిని ఓపెన్ చేసినపుడు అందులో ఏ కంటెంట్ ఉంటే దాన్నే చదువుతారు. తాము చదువుతున్న కంటెంట్ నిజమవ్వచ్చు లేదా అబద్ధమూ అవ్వచ్చు.   ఏదేనా అంశానికి సంబంధించి మార్పులు, చేర్పులకు వికిపీడియాది బాధ్యత లేదు. కాకపోతే మార్పులు, చేర్పులు మరీ అభ్యంతరకరంగా ఉందని ఫిర్యాదులు వస్తే  మాత్రం జోక్యం చేసుకుంటుంది. బిసిజి నివేదిక రాగానే ముందు ఒకరు బిసిజిని బఫూన్స్ కన్సల్టెంగ్ గ్రూపు గా మార్చారు.

 

ఇక అక్కడి నుండి ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు మార్చేశారు.  విచిత్రమేమిటంటే అమెరికాలోని బోస్టన్ నగరంలో 1963లో ఏర్పాటు చేసిన  బిసిజి జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డికి భాగస్వామ్యం ఉందని మార్చేశారు. దాంతో చదువుకున్న నెటిజన్లు తమకు కనిపించిన వివరాలే నిజమని పొరబాటు పడుంటారనటంలో సందేహం లేదు. అయితే వెంటనే ఎవరో ఇచ్చిన ఫిర్యాదుతో నిర్వాహకులు రంగంలోకి దిగారు.

 

దాంతో బిసిజికి సంబంధించిన వాస్తవ  సమాచారాన్ని ఎవరో 12 సార్లు మార్పులు, చేర్పులు చేయటమే కాకుండా తప్పుడు సమాచారాన్ని అందించినట్లు ప్రకటించారు.  జగన్, విజయసాయిపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని చూసిన తర్వాత వైసిపి సోషల్ మీడియాలో ఇదంతా టిడిపి నేతల పనే అంటూ మండిపోతున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: