సినీనటి ఎమ్మెల్యే రోజా.. అటు రాజకీయాలను ఇటు  సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతోంది నగరి ఎమ్మెల్యే రోజా. సినిమాల్లో సత్తా చాటిన రోజా ఆ తర్వాత టిడిపి పార్టీలో చేరింది... ఇక వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తప్పుకొని వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత వైసీపీ పార్టీలో చేరి కష్టనష్టాల్లో జగన్ వెన్నంటే ఉంటూ.. అన్నా అంటూ అండగా నిలిచింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వైసిపి పార్టీని వీడలేదు రోజా. 2014లో ఎమ్మెల్యే గా  నగరి నుంచి గెలుపొందారు రోజా. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కూడా రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు రోజా. వైసిపి పార్టీ స్థాపించినప్పుడు నుంచి వైసీపీలో కీలక నేతగా ఉన్న రోజ కు మంత్రి పదవి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ మొదట మంత్రి పదవి దక్కకపోయినప్పటికే మంత్రి హోదా ఉన్న ఏపీఐఐసి చైర్మన్ పదవి  కట్టబెట్టారు  జగన్మోహన్ రెడ్డి. 

 

 

 ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విపక్షాలు ఏ చిన్న మాట అన్న సరే వారికి గట్టిగా కౌంటర్ ఇస్తూ ఉంటుంది నగరి ఎమ్మెల్యే రోజా. ప్రతిపక్ష పార్టీల తీరు ఎండగట్టడంలో నగిరి ఎమ్మెల్యే రోజా ముందుంటుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేసిన వారిపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ వైసీపీలో కీలక నేతగా మారిపోయింది రోజా. ప్రస్తుతం నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసీ చైర్మన్గా కొనసాగుతున్నారు రోజా. ఓవైపు రాజకీయాల్లో కీలక నేతగా దూసుకుపోతు.. మరోవైపు జబర్దస్త్ సోలో జడ్జి గా కొనసాగుతు... మరికొన్ని  వేడుకల్లో  ముఖ్య అతిథిగా హాజరై  అటు బుల్లితెర ఇటు  రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు. 

 

 

 అయితే చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో తన పై జరిగిన దాడి గురించి తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. ఎన్నికల్లో తనకు వెన్నుపోటు పొడిచిన నాయకులు తనపై దాడికి పాల్పడ్డారంటూ ఆరోపించారు నగరి ఎమ్మెల్యే రోజా. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు అంటూ హెచ్చరించారు. కాగా ఆదివారం పుత్తూరు మండలం కేబిఆర్ పురం గ్రామ సచివాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన రోజాపై.. వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు.  ఈ ఘటన ఆంధ్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: