ప్రాణాంతకమైన జబ్బుల బారిపడిన రోగులకు వైద్యం చేస్తుండగా చిన్న చిన్న తప్పులు దొర్లుతుంటాయి. ఆ తప్పులు జరిగిన వెంటనే కొన్ని తప్పనిసరి జాగ్రత్తలను తీసుకుంటారు వైద్యులు. అలా చేయకపోతే, వారు కూడా ఆ ప్రాణాంతకమైన రోగాల బారిన పడతారు. అయితే, ఒక నర్సు ఒక రోగికి చికిత్స చేస్తున్నపుడు ఓ తప్పు చేసి.. తాను కూడా ఆ మహమ్మారి జబ్బు బారినపడి మృత్యు ఒడిలోకి చేరింది.


వివరాల్లోకి వెళితే, వనపర్తి గోపాల్ రావు పేటకు చెందిన ఒక యువతి నర్సింగ్ కోర్స్ థర్డ్ ఇయర్ చదువుతుంది. గతంలో ఆమె తన ట్రైనింగ్ నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి లోని రోగులకు వైద్యం చేస్తుండేది. ఈ క్రమంలోనే రకరకాల జబ్బుల బారిపడిన రోగులకు ఇంజక్షన్ వేస్తుండగా ఆమెకు ఒక సూది గుచ్చుకుంది. అయితే, ఆ సమయంలో ఆమె ఒక హెచ్ఐవి పేషెంట్ కు వైద్యం చేస్తుంది. అతనికి ఇంజక్షన్ చేసిన సూది ఈ యువతికి గుచ్చుకున్నప్పటికీ ఆమె ఎటువంటి యాంటీ డోస్ లను తీసుకోలేదు. వాస్తవానికి, సూది కుచ్చుకున్న ఆమె చేతికి వాపు కూడా వచ్చింది. దాంతో, ఆమె కేవలం కొన్ని మాత్రలను వేసుకొని కాలం వెళ్లదీసింది. కొన్ని వారాల తరువాత ఆమెకు పంటి నొప్పి రావడంతో డెంటల్ హాస్పిటల్ కు వెళ్ళింది. అయితే, అక్కడి వైద్యులు ఆమెకు రక్తపరీక్ష చేయగా హెచ్ఐవి ఉందని తేలింది. ఆ విషయం ఆమెకు తెలియజేయగా.. ఉస్మానియా ఆసుపత్రిలో కొన్ని రోజులు చికిత్స చేయించుకొని క్రిస్మస్ సెలవులకు వెళ్లిపోయింది ఆ నర్స్. ఆ తరువాత తనకు సోకినా జబ్బును ఎవరికి చెప్పలేదు.


ఆ విధంగా ఆమె తన ఆరోగ్య పరిస్థితిని ఎవరికి చెప్పుకోవపోవడంతో.. చికిత్స అందక ఆమె తన తుది శ్వాస విడిచింది. దాంతో, ఆమె కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు కూడా కన్నీరుమున్నీరవుతున్నారు. ఏదేమైనా, ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టే ఒక నర్స్ తన చిన్న వయసులోనే మరణించడం చాలా బాధాకరం. 

మరింత సమాచారం తెలుసుకోండి: