తెలంగాణ సీఎం కెసిఆర్, ఏపీ సీఎం జగన్ ఇద్దరు రాజకీయంగా స్నేహంగా మెలుగుతూ ఇరు రాష్ట్రాల సమస్యను ఒక కొలిక్కి కొలిక్కి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ తన వంతు సహాయ సహకారాలు కూడా అందించారు. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్, కేసీఆర్ అనేకసార్లు భేటీ అవ్వడం ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వివాదాలు, పంపకాలు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అధికారులతో కలిసి చర్చించి ఒక స్నేహపూర్వక వాతావరణంలో ఒక అంగీకారానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఇంకా అనేక సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈనెల 13వ తేదీన భేటీ కాబోతున్నట్టు తెలుస్తోంది. 


 ఈ భేటీలో ప్రధానంగా కేంద్రంతో సంబంధాలతో పాటు, ఏపీలో కీలక అంశంగా మారిన మూడు రాజధానుల అంశం పైన ఈ ఇద్దరు సీఎంలు సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 13వ తేదీన హైదరాబాదులోని ప్రగతి భవన్ లో ఈ సమావేశం జరగబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించగానే తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తెర మీదకు వచ్చి ఆర్టీసీ కార్మికులు చాలాకాలం సమ్మెబాట పట్టారు. దీనిపై అనేక వివాదాలు అలుముకున్నాయి. దీంతో ఇద్దరి మధ్య మరింత దూరం పెంచాయని అందరూ భావిస్తున్న తరుణంలో ఇప్పుడు ఈ ఇరువురు ముఖ్యమంత్రులు భేటీ కాబోతుండడం  ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా అమరావతి, మూడు రాజధానుల వ్యవహారంపైనా కెసిఆర్ సలహాలను జగన్ తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.


 గతంలో అమరావతి లో పెట్టుబడులు పెట్టడం డెడ్ ఇన్వెస్టిమెంట్ అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పెద్ద ఎత్తున అమరావతి ప్రాంతంలో ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ కేసీఆర్ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే వైసీపీ మాత్రం ఇందులో రాజకీయ అంశాలు ఏవీ లేవని, కేవలం ఇరు రాష్ట్రాల సమస్యల మీదనే ఈ ఇరువురి భేటీ జరుగుతున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: