మందు బాబులు చేసే మజాక్ మామూలుగా ఉండదు. తాగి తందనాలు ఆడుతారు. మందెక్కువైతే పామును తాడని పట్టుకుంటారు. కుక్కతో లిప్ కిస్సింగ్స్ పెడతారు. అబ్బో వారు వేసే వేషాలు చెప్పాలంటే చిన్నపాటి టీవి సీరియల్ అవుతుంది. మొన్నటికి మొన్న పీకల దాక తాగిన ఓ మందు బాబు పాముతో పరాచకాలు ఆడి ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. మరొకవ్యక్తి చెకోడిలు నమిలినట్లు పామును కరకరా నమిలాడు.

 

 

ఇలా వారు తెలియక చేసేపనులు వారి ప్రాణాలను రిస్కులో పెడుతున్నాయి. ఇక తాగుడు అలవాటు ఉన్నవారికి సమయానికి ఆ చుక్క గొంతులోకి దిగకుంటే తోక కాలిన కోతిలా గెంతుతుంటారు. కొందరైతే ఏదో ఒకపెగ్గు వేసామా ఇంటికెళ్లి పడుకున్నామా అనేలా ఉంటారు. మరి కొందరు గొంతులో వేలుపెడితే  అందేలా అంటే పీకల దాకా తాగుతారు. ఇక ఆతర్వాత వేసే వేషాలు, ఆడే ఆటలు మామూలుగా ఉండవు. ఇక ఇప్పుడొక మందు బాబు తన కారుని పార్కింగ్ ఎక్కడ చేసాడో తెలిస్తే పొట్ట చెక్కలైయ్యేలా నవ్వుతారు.

 

 

అతని పార్కింగ్ చేయడానికి చోటు దొరక్క సిమ్మింగ్ ఫూల్లో తన కారును పార్క్ చేసాడట. ఈ విచిత్ర ఘటన ఎక్కడ జరిగిందంటే ఫ్లొరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుందట. ఇక అక్కడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీకలదాగా మద్యం తాగిన ఓ వ్యక్తి హాలీడే ఇన్ హోటల్‌ వద్ద కారును పార్క్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ సందర్భంగా కారును వెనక్కి నడుపుతూ ఒక్కసారిగా ఎక్స్‌లేటర్ మీద కాలు కొంచెం దబాయించి వేసాడట.

 

 

అసలే నిషాలో ఉన్నాడు కదా ఏం చేస్తున్నాడో అతనికి అర్ధం కాలేదట.. దీంతో అది హోటల్ గ్రిల్స్‌ను ఢీకొట్టి నేరుగా స్విమ్మింగ్ పూల్‌లోకి దూసుకెళ్లింది. అతడు కారుతోపాటు స్విమ్మింగ్ పూల్‌ నీటిలో మునిగిపోయాడట. ఈ ప్రమాదాన్ని గుర్తించిన హోటల్ సిబ్బంది ఆ వ్యక్తిని కాపాడారు.

 

 

ఇకపోతే ఈ సంఘటన జరిగిన సమయంలో స్విమ్మింగ్ పూల్‌లో వద్ద ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందట. ఇక ఈ ఫొటోను ఫేస్‌బుక్‌లో వెస్ట్ పామ్ బీచ్ పోలీసులు పోస్టు చేశారు. వాటిని చూసిన నెటిజనులు కడుపుబ్బా నవ్వకుంటు ఆ డ్రైవర్‌పై సెటైర్లు పేలుస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: