రాజకీయంగా దూకుడు నిర్ణయాలతో ముందుకు వెళుతూ ఏదో ఒక రకంగా జనసేన పార్టీని బలమైన పార్టీగా తీర్చిదిద్ది కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకు చాలా కాలంగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే ఎప్పటి నుంచో ప్రజా ఉద్యమాలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పవన్ ప్రశ్నిస్తూ జనసేనను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని ద్వారా పార్టీ నాయకుల్లో మనోధైర్యం పెంచాలనే ఆలోచన పవన్ లో ఉంది. త్వరలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల గంట  మార్మోగనున్న నేపథ్యంలో వివిధ నియోజక వర్గాలకు ఇంచార్జిలను పవన్ నియమించారు. అసెంబ్లీ, పార్లమెంటరీ వారీగా నాయకులకు బాధ్యతలు అప్పగిస్తూ పవన్ ఆదేశాలు జారీ చేశారు.


 గత కొంత కాలంగా పార్టీకి, పవన్ కు దూరంగా ఉంటూ జగన్ ఫోటోలకు పాలాభిషేకం చేస్తూ పార్టీని లెక్కచేయకుండా ఉన్న రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు కూడా బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమైంది. ఆయనతో పాటు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సైతం చాలా కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ కమిటీలో ఆయనకు కూడా చోటు కల్పించారు.


వివిధ జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా ఇంచార్జీలను నియమించడంతో పాటు ఉత్తరాంధ్ర లో పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ఐదుగురు సభ్యులతో సమన్వయ కమిటీని పవన్ నియమించారు. ఈ సమన్వయ కమిటీలో శివ శంకర్, సుజాత, బొమ్మిడి నాయకర్, వై. శ్రీనివాస్ సభ్యులుగా ఉంటారని జనసేన పార్టీ కార్యాలయం తెలిపింది.ఈ కమిటీ శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, విశాఖపట్నం రూరల్ ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తుందని పవన్ తెలిపారు. రాష్ట్రంలో పలు పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జీల నియామకం ఈ విధంగా ఉంది.


విశాఖపట్నం పార్లమెంటరీ ఇంచార్జీగా వివి. లక్ష్మీనారాయణ ,విశాఖపట్నం నార్త్ ఉషా కిరణ్, గాజువాక కోన తాతారావు, భీమిలి పంచకర్ల సందీప్, అనకాపల్లి అసెంబ్లీ పరుచూరి భాస్కరరావు, యలమంచిలి సుందరపు విజయ్ కుమార్, చోడవరం టి వి ఎస్ ఎం రాజు, అరకు పార్లమెంటరీ ఇంచార్జి పి. గంగులయ్య, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పార్లమెంటరీ ఇంచార్జీగా పంతం నానాజీ, పిఠాపురం మాకినీడు శేషుకుమారి, పెద్దాపురం తుమ్మల రామస్వామి, కాకినాడ సిటీ ముత్తంశెట్టి శశిధర్, జగ్గంపేట పాఠంశెట్టి సూర్యచందర్రావు, ప్రత్తిపాడు  వరుపుల తమ్మయ్య, అమలాపురం పార్లమెంట్ ఇంచార్జీగా డి.ఎం.ఆర్ శేఖర్, అమలాపురం అసెంబ్లీ రాంబాబు, ముమ్మిడివరం పితాని బాలకృష్ణ, రామచంద్రపురం పోలిశెట్టి చంద్రశేఖర్, రాజోలు రాపాక వరప్రసాద్, గన్నవరం పాముల రాజేశ్వరి, కొత్తపేట బండారు శ్రీనివాస్, మండపేట వేగుళ్ళ లీలా కృష్ణ, రాజమండ్రి పార్లమెంట్ ఇంచార్జీ కందుల దుర్గేష్, అనపర్తి రెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి సిటీ సత్యనారాయణ, రాజానగరం రాయపరెడ్డి ప్రసాద్, రాజమండ్రి రూరల్ దుర్గేశ్, గుంటూరు జిల్లా గుంటూరు పార్లమెంట్ ఇంచార్జి శ్రీనివాస్ యాదవ్, గుంటూరు వెస్ట్ తోట చంద్రశేఖర్, గుంటూరు ఈస్ట్ షేక్ జియా ఉర్, రేపల్లె కమతం సాంబశివరావు, మంగళగిరి చిల్లపల్లి శ్రీనివాస్, తెనాలి నాదెండ్ల మనోహర్, సత్తెనపల్లి వై. వెంకటేశ్వర్ రెడ్డి, నరసరావుపేట సయ్యద్ జిలాని, చిత్తూరు జిల్లా పీలేరు దినేష్, మదనపల్లి గంగారపు స్వాతి, శ్రీకాళహస్తి వినుత, తిరుపతి కిరణ్, గంగాధర r నెల్లూరు డాక్టర్ పొన్న గంగాధర్.

మరింత సమాచారం తెలుసుకోండి: