ఏపీ రాజధాని సమస్య ఒక కొలిక్కి వచ్చింది! జగన్ తన పంతాన్ని నెగ్గించుకున్నాడు. 16 మంది సభ్యులతో కూడిన హైపవర్ కమిటీ జిఎన్ రావు మరియు బిసిజి కమిటీలు ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన మీదట గంటల తరబడి విస్తృతంగా చర్చించిన వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కచ్చితంగా 3 రాజధానిలో అవసరం అని తేల్చి చెప్పేశారు.

 

దీంతో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కానుండగా కర్నూల్ జుడిషియల్ క్యాపిటల్ గా నిర్ణయించబడుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించిన అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ గా ఉంచుతారు. రాజధాని ప్రాంతం లోని 29 గ్రామాల రైతులు కొద్ది వారాలుగా చేస్తున్న నిరంతర ధర్నాలు ఇక నుంచి మరింత ఉధృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

రోజు ఏకంగా జాతీయ రహదారిని బ్లాక్ చేసేసిన ప్రజలు రేపు మరింత విపరీతంగా వారి వ్యతిరేకతను తెలియజేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో అమరావతి దగ్గరలోని పోలీసులు తీవ్ర అప్రమత్తతో ఉండాలని పై వర్గాలు హెచ్చరించినట్లు సమాచారం. అలాగే వెంటనే పరిస్థితిని అదుపులో పెట్టేందుకు సరిపడా బలగాలను పంపించనున్నట్లు కూడా మనకు తెలుస్తోంది.

 

ఇకపోతే ఈరోజు మధ్యాహ్నం ఉన్నఫలంగా నారా లోకేష్ అరెస్ట్ కావడం మరియు అనేక మంది ప్రముఖ టిడిపి నాయకులు ను  హౌస్ అరెస్టు చేయడంతో అప్పటికే ఏపీ రాష్ట్రానికి ఇక నుండి 3 రాజధానులని ప్రజలంతా ఫిక్స్ అయిపోయారు. అయితే అమరావతిలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు కు జగన్ విధంగా న్యాయం చేకూరుస్తాడో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: