తప్పు చేయాలి అనే ఆలోచన వచ్చినవాని ముందు ఏ చట్టం పనిచేయదని ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటన నిరూపిస్తుంది. ఎందుకంటే ఏపీ ముఖ్యమంత్రి మహిళల అత్యాచారాలపై కఠినమైన చట్టాన్ని అమలు చేసిన ఆడవారిపై అత్యాచారాలు ఆగడం లేదు. మగాళ్లూ, మృగాళ్లలా రెచ్చిపోతూ ఉన్నారు. ఇక్కడ ఒక వివాహితను అత్యంత దారుణంగా గ్యాంగ్ రేప్ చేసారు. కొంతైన జాలి, దయ లేకుండా హింసించారు. ఆ వివరాలు చూస్తే.......

 

 

ఏలూరు గ్రామీణ పరిధిలోని నాగేంద్ర కాలనీకి చెందిన ఓ వివాహిత తన కుమారుడు అనారోగ్యంగా ఉండటం వల్ల అతనికి మందులు తెచ్చెందుకు రాత్రి 10 గంటల సమయంలో సమీపంలోని మెడికల్‌ షాపునకు కాలి నడకన వెళ్లి మందులు తీసుకుని, తిరిగి ఇంటికి బయలుదేరగా.. అదే కాలనీకే చెందిన యాకోబు అనే రౌడీషీటర్‌ వచ్చి ఆమెను ఇంటివద్ద దించుతానని చెప్పి తన బైక్‌ ఎక్కమన్నాడు. ఆమె నిరాకరించగా వదలకుండా తన మాటలతో మాయచేసి బైక్ ఎక్కించుకున్నాడు.

 

 

అతను తెలిసిన వ్యక్తి కావడంతో ఆ మహిళ కూడా అతని మాటలు నమ్మి తనతో పాటుగా వెళ్లింది. వారు ఉండే కాలనీ దాటి బైక్‌ను సమీపంలోని మైదాన ప్రాంతానికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ముగ్గురు రౌడీ షీటర్లు, మరికొందరు యువకులు మాటు వేసి ఉన్నారు. ఆ మహిళ ప్రతిఘటించబోగా..  వారంతా కలిసి కొబ్బరి మట్టలతో ఆమెను తీవ్రంగా కొట్టి.. బలవంతంగా మద్యం తాగించి.. ఆమె ఒంటిపై దుస్తులన్నీ తొలగించి.. ఒకరి తరువాత ఒకరు రాత్రంతా అత్యాచారానికి పాల్పడగా ఆమె స్పృహ కోల్పోయింది.

 

 

తెల్లవారుజామున మెలుకువ వచ్చిన బాధితురాలు లేవలేని స్థితిలోనే ముళ్లపొదల మధ్య నుంచి పాకుతూ నగ్నంగానే రోడ్డుపైకి చేరుకుంది. అటుగా వచ్చిన వ్యక్తి ఆమె ధీనావస్దను చూసి తాను ధరించిన స్వెటర్‌ను ఆమె ఒంటిపై కప్పి వెళ్లిపోయాడు. ఆ మహిళ నడవ లేని స్థితిలోనే ఇంటికి చేరుకుంది.

 

 

ఈమె భర్త ఉపాధినిమిత్తం వేరే చోట ఉండటం వల్ల, తన ఇంటికి వచ్చిన బంధువు ద్వారా విషయం బయటకు తెలిసింది. అతను చుట్టుపక్కల వారిని కూడగట్టి.. బాధితురాలిని ఏలూరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చి ఫిర్యాదు చేయగా. రూరల్‌ సీఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: