సంపన్న  వర్గాలని టార్గెట్ చేసుకుని విజృంభించి చంబల్ లోయ ముఠా హైదరాబాద్లో అడుగు పెట్టినట్లు సమాచారం. ఢిల్లీ సహా పలు నగరాల్లో భారీ చోరీలకు పాల్పడిన ఈ ముఠా ప్రస్తుతం హైదరాబాద్ పై కన్నేసింది. పని మనుషుల్లాగా ఇంట్లో చేరి ఆ తర్వాత అదును చూసుకొని అందినకాడికి దోచుకో పోతుంది ఈ ముఠా. హైదరాబాద్ నగరంలోనే ఇప్పటికే మూడు కోట్లు కొల్లగొట్టింది ఈ ముఠా. ఈ ఘటన తర్వాత సంపన్న వర్గాల్లో భయం పట్టుకుంది. వివరాల్లోకి వెళితే... బీహార్లో సిజోల్  ప్రాంతానికి చెందిన రాహుల్ ముఖియా ముఖ్య అలియాస్ దాహుర్  అలియాస్ రాజు అతడు ముఠాలోని 10 మంది సభ్యులు కొన్ని నెలల క్రితమే హైదరాబాద్ నగరంలో అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. గత నెల 9న బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లోని ప్రముఖ వ్యాపారి ఇంట్లో జరిగిన భారీ చోరీ వెనుక సింబల్ లోయ ముఠా సభ్యుడు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.

 

 

 

 అయితే బాధిత వ్యాపారి ఇంట్లో అంతకుముందే పనికి కుదిరిన రామ్ ఆశిష్ అలియాస్ కరణ్ ముకియా  ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదును చూసుకొని ఏకంగా మూడు కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో ఉడాయించాడు. ఇక ఇది చంబల్ లోయ ముఠా పనేనని అనుమానించిన పోలీసులు రంగంలోకి దిగారు. అయితే రాహుల్ ముకియా  హైదరాబాద్ నగరంలో అడుగు పెట్టడానికి ముందే ముఠా సభ్యుడు బోలా పని మనుషులను కుదిర్చి పెడతానంటూ బంజారాహిల్స్ లోని  పలువురు సంపన్నులను కలిశాడు. బోలా  బంజర హిల్స్ రోడ్ నెంబర్ 10 లో రాహుల్ ముకియాను,  రోడ్నెంబర్ 12లో కపిల్  గుప్త నివాసంలో రామ్ ఆశిష్ ముఖియా  ను పనికి కుదీర్చాడు ఆ వ్యక్తి. మిగతా ఎనిమిది మందిని బంజారాహిల్స్ బేగంపేట గోపాలపురం జూబ్లీహిల్స్ మాదాపూర్ లలో పనికి కుదిర్చాడు . ఈ క్రమంలోనే అదును కోసం వేచి చూసినా రామ్  ఆశిష్ యజమానులు ఇంట్లో లేని సమయంలో భారీ చోరీకి పాల్పడ్డాడు.

 

 

 

 ఏకంగా మూడు కోట్ల విలువైన ఆభరణాలతో ముఠా సభ్యులు పారిపోయారు. అయితే వీరందరిని పనికి కుదిర్చిన బోలా పోలీసులకు చిక్కడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఒకప్పుడు అందరిని  గడగడలాడించిన బందిపోటు రాణి ఫూలన్ దేవి సంబందికులైన  రాహుల్ ముకియా  సోదరుడు సురేష్ ముకియా  పది సంవత్సరాలుగా ఈ ముఠాను నడిపిస్తూ సంపన్నుల దగ్గర పనికి కుదిరి ఎన్నో చోరీలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ముఠా సభ్యులు భగవత్ బోలా హరిశ్చంద్ర ముకీయాలు  ఇప్పటికే పోలీసుల కస్టడీలో ఉండగా... కీలక నిందితుడైన రాహుల్ ముకియా  తో పాటు మరికొందరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇకపోతే ఈ ముఠా హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టడంతో సంపన్న వర్గాలు భయంతో వణికి పోతున్నాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనే అనుమానంతో ఉంటున్నాయి సంపన్న వర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: