నేడు దేశవ్యాప్తంగా బ్యాంకులు అన్ని బంద్.. ఈ సంగతి మనకు 8 రోజుల క్రితమే తెలుసు. అయితే నిన్నటికి నిన్న ఓ పేపర్ బ్యాంకు పనులు ముందే చూసుకోవాలని హైఅలెర్ట్ కూడా ప్రకటించింది. అయితే తాజాగా మోడీ సర్కార్ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. ఆ షాక్ చుసిన ఉద్యోగులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. 

 

సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల పిలుపు మేరకు నేడు జరగనున్న భారత్ బంద్‌లో తమ ఉద్యోగులకు పాల్గొనవద్దని ఆర్డర్లు కూడా జారీ చేసింది. ఒకవేళ ప్రభుత్వ ఉత్తర్వులను అతిక్రమించి సమ్మెలో పాల్గొంటే ఇబ్బందులు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. పది సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు జనవరి 8న అంటే ఈరోజే దేశ వ్యాప్తంగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. 

 

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ భారత్ బంద్ జరుగుతోంది. ట్రేడ్ యూనియన్లతో పాటు బ్యాంక్ యూనియన్లు కూడా ఈ భారత్ బంద్‌లో పాల్గొంటున్నాయి. అయితే ఇందులో ఏ ఉద్యోగి అయినా సరే ఏ రూపంలోనైనా పాల్గొంటే.. తగిన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. 

 

వేతన తగ్గింపు, క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలను ఎదుర్కోవలసి ఉంటుంది’ అని ఉత్తర్వులు పేర్కొంటున్నాయి. అన్ని సెంట్రల్ గవర్నమెంట్ విభాగాలకు చెందిన ఉద్యోగులందరికీ ఈ ఆర్డర్లు వెళ్లాయి. ఉద్యోగులు సమ్మోలో పాల్గొనచ్చు అని అనుమతి ఇచ్చే చట్టబద్దమైన నిబంధన లేదని కేంద్రం చెప్తుంది. అంతేకాదు బ్యాంకు పై అధికారులకు కూడా.. కింద ఉద్యోగులకు ఎవరికీ సెలువు ఇవ్వొద్దని పేర్కొంది. 

 

అయితే కేవలం బ్యాంక్ ఉద్యోగులు మాత్రమే కాకుండా వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు, వర్కర్లు కూడా ఈ భారత్ బంద్‌లో పాల్గొనబోతున్నారు. అందుకే రేపు జనవరి 8న బ్యాంకింగ్ సేవలు అన్ని ఆగిపోనున్నాయి. అలాగే ఏటీఎం సర్వీసులపై కూడా ఎక్కువ ప్రభావం పడనుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: