దాదాపు 14 నెలల పాటు పాకిస్థాన్ చేతిలో ఆంధ్రప్రదేశ్ కు  చెందిన మత్స్యకారులు ఎట్టకేలకు సొంత గడ్డపై అడుగు పెట్టారు. వైసీపీ ఎంపీల పోరాటం ఫలితంగా వారిని  ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ స్వయంగా వాగా బోర్డర్ నుంచి రాష్ట్రానికి తీసుకువచ్చారు. పాకిస్థాన్ జైలు  నుంచి బయటపడిన శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనను రక్షించి సొంత గడ్డకు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు శ్రీకాకుళంకు చెందిన మత్స్యకారులు. ఈరోజు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్ను  కలిసిన 20 మంది మత్స్యకారులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. పాక్ నుంచి తీసుకొచ్చిన మత్స్యకారులని  పశుసంవర్ధక మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్దకు తీసుకెళ్లారు.

 

 

 పాకిస్తాన్ జైలులో మగ్గిన  తాము పాకిస్థాన్ నుంచి బయటపడతామ లేదా  అని ఎంతో భయాందోళనకు గురి అయ్యామని కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చొరవతో చివరికు  విడుదల అయ్యామని సంతోషం వ్యక్తం చేశారు. ఇక అమరావతి నుంచి తన సొంత ఊర్లకు బయలుదేరనున్నారు మత్స్యకారులు. దాదాపు ఏడాది తర్వాత తమ కుటుంబ సభ్యులను కలువనున్నారు. దీంతో వారి వారి గ్రామాల్లో కూడా సందడి వాతావరణం నెలకొంది. వారికి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు  చేస్తున్నారు ఆయా గ్రామస్తులు. ఇదిలా ఉండగా పాక్ జైలు  నుంచి విడుదలైన మత్స్యకారుల అందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కృషి వల్లనే 20 మంది పేద మత్స్యకారులు తిరిగి రాగలరని ఆయన తెలిపారు. 

 

 

 పాకిస్తాన్ జైలులో ఉన్న మరో ఇద్దరు పత్రాల పరిశీలన లో ఆలస్యం కావడంతో నే విడుదల కాలేదని వారు కూడా పది రోజుల్లో విడుదల అవుతారని  అంటూ చెప్పుకొచ్చారు. ఇకపోతే 2018 నవంబరు మత్స్యకారులు  గుజరాత్ సమీపంలోని అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లి పొరపాటున సరిహద్దు దాటి పాకిస్తాన్ కోస్ట్ గార్డులకు  22 మంది మత్స్యకారులు  చిక్కారు . వీరిలో  శ్రీకాకుళంకు చెందిన 15 మంది విజయనగరం జిల్లాకు చెందిన ఐదుగురు  ఉన్నారు. కాగా  వీరిని విడుదల చేయాలని టిడిపి వైఎస్ఆర్సీపీ ఎంపీలు కేంద్రానికి కోరగా వెంటనే రంగంలోకి దిగి పాకిస్థాన్  వారితో చర్చలు జరిపి 20 మందిని పాకిస్తాన్ జైలు నుంచి విడుదల చేయించింది కేంద్రం .

మరింత సమాచారం తెలుసుకోండి: