సాధారణంగా దొంగలు గొడలు దూకి.. ఇంటి తాళాలు పగులగొట్టి ఎవరూ లేని సమయంలో దొంగతనాలకు పాల్పపడుతుంటారు.  ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తున్న చెడ్డీ గ్యాంగ్ గురించి తెలిసిందే.. నెక్కర్లు వేసుకొని గుంపులుగా ఇళ్లల్లో చోరీలకు పాల్పపడుతున్నారు.  వీరి దొంగతనానికి ఎవరైనా అడ్డు వస్తే వారిని చిత్ర హింసలకు గురి చేయడం..లేదంటే చంపే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అందినంత డబ్బులు, నగలు దోచుకు వెళ్తుంటారు. ఇక చైన్ స్నాచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు టార్గెట్ చేసుకొని వారి మెడలోనుంచి విలువైన నగలు దోచుకు వెళ్తున్నారు.   తాజాగా ఓ దొంగ చేసిన చిలిపి పనికి ఇంటి యజమాని హడలెత్తిపోయాడు.. కాకపోతే బయంతో కాదు..కవుపుబ్బా నవ్వుకోలేక.  

 

దొంగతనాకి వచ్చిన ఓ ఇరవై ఏళ్ల యువకుడు ఓ ఇంటికి దొంగతనానికి వచ్చాడు.  దొంగ తనం చేయాల్సింది పోయి పడుకున్న ఆ ఇంటి యజమాని కాళ్లను ఐస్‌క్రీమ్‌లా చప్పరించడం మొదలు పెట్టాడు. అయితే తన కాళ్ల వేళ్లపై ఏదో పాకినట్లు అనిపించడంతో ఆ ఇంటి యజమానికి మెలుకువ వచ్చింది.. దొంగను చూసి షాకయ్యాడు. ఈ వింత సంఘన ఫ్లొరిడాలోని బ్రాడెన్టాన్‌లో చోటుచేసుకుంది. తన ఇంటికి  దొంగతనానికి వచ్చి  కాళ్ల వేళ్లను నాకడం చూసి ఆశ్చర్యపోయాడు. అయితే నవ్వాలో.. ఏడ్వాలో తెలియని పరిస్థితిలో కేకలు వేయబోయాడు.. అంతలోనే ఆ దొంగ తన జేబులో నుంచి ఓ గన్ తీసి అరిస్తే కాల్చివేస్తానని అన్నాడు.

 

తర్వాత బాధితుడిని పక్కకు గెంటేసి ఇంటి నుంచి ఉడాయించాడు.  కాకపోతే పోతూ పోతూ ఇంటి యజమాని కారు అద్దాలు పగులగొట్టి వెళ్లాడు.  సమాచారం అందుకున్న పోలీసులు ఇంటిలో ఏవైనా విలువైన వస్తువులు పోయాయా అని యజమానిని ప్రశ్నించగా అదేమీ లేదని అన్నారు. పోలీసులు జాగిలాలతో ఆ దొంగ ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే బాధితుడి కాళ్ల మీద ఉన్న దొంగ లాలాజలాన్ని సేకరించి డీఎన్ఏ టెస్టు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: