సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ వైభవంగా జరుపుకుంటారు అన్న విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఇంటి ముంగిట్లో రంగు రంగుల ముగ్గులు... హరిదాసు కీర్తనలు గంగిరెద్దుల ఆటలు.. ఇలా అన్ని కనిపిస్తూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరూ అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. అంతేకాదండోయ్ సంక్రాంతి పండుగ అంటే అందరికీ గుర్తొచ్చేది మరొకటి కూడా ఉంది. అది ఏంటో తెలుసా.. కోడి పందాలు. తెలంగాణ రాష్ట్రంలో కోడిపందాల సాంప్రదాయం అంతగా కనిపించదు కానీ ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం కోడి పందాలు సాంప్రదాయం బాగా కనిపిస్తూ ఉంటుంది. అయితే కోడిపందాలు చట్ట విరుద్ధం అయినప్పటికీ కోడిపందాలను నిర్వహించేందుకు ప్రజలందరూ ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. 

 

 

 సంక్రాంతి వస్తుందంటే ఆరు నెలల ముందు నుంచే కోళ్లను కోడిపందాల కోసం రెడీ  చేస్తూ ఉంటారు. దీంతో సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఉభయగోదావరి జిల్లాలో ఉండే సందడి పేరు. ఇంకొంతమంది కోడిపందాలు నిర్వహించే వారికోసం పందెం కోళ్లను  బాగా పెంచి వాటిని ఎక్కువ ధరకు అమ్ముకుని వ్యాపారం చేస్తూ ఉంటారు. అయితే ఇలాగే వ్యాపారం చేద్దాం అని అనుకోని 45 కోడిపుంజులను పెంచారు కొంతమంది వ్యక్తులు.కానీ పోలీసులు పక్కా సమాచారంతో 45 పందెం పుంజులను పట్టుకున్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపాలెం పట్టణానికి చెందిన దేవరకొండ సుబ్బారాయుడు,దేవరకొండ మధు,  పాలకుర్తి నాగయ్య,  సీనయ్య దాసరి రామస్వామి లతో కూడిన బృందం సుమారు 50 పందెం కోళ్లను లారీలో తీసుకొచ్చి మలికిపురం లోని పద్మ థియేటర్ సమీపంలో మంగళవారం నాడు అమ్మకానికి పెట్టారు. 

 

 

 

 అయితే దీనిపై పక్కా సమాచారం అందుకున్న మలికిపురం ఎస్ ఐ కేవీ రామారావు  సిబ్బందితో పందెం కోళ్లను అమ్ముతున్న వారిపై దాడి చేసి సుమారు 45 పందెం కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితులపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. రాజోలు సర్కిల్ పరిధిలో పందెం కోళ్లను అమ్మిన.. కోడి పందాల నిర్వహించిన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్న 45 పందెం కోళ్లు మలికిపురం పిఎస్లో పోలీసుల ఆధీనంలోనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: