లోకంలో మనుషులు బ్రతకాలంటే ఇతర జీవుల ప్రాణాలను తీయడం అనే విద్యను పూర్వకాలం నుండే మానవుడు నేర్చుకుని ఉన్నాడు. నిజానికి భూమి మీద మనుషులకు ఎంత హక్కు ఉందో, ఇతర ప్రాణులకు కూడా అంతే హక్కు ఉంది. కానీ తేడా ఎక్కడంటే. ఆలోచన శక్తి, ప్రమాదాలను గ్రహించే అంతటి తెలివి తేటలు, మోసం చేసే ఉపాయాలు మనుషులు తన ఎదుగుదలతో పాటే పెంచుకున్నారు. కానీ మూగ ప్రాణులకు ఇవేమి తెలియవు, చెప్పటానికి వాటికి మన బాష రాదు. అరవడం తప్ప నోరు తెరచి చెప్పలేవు.

 

 

ఒక వేళ మనుషులకు ఇచ్చినట్లుగా భగవంతుడు వాటికి కూడా మాట్లాడే శక్తి ఇస్తే ఈ మానవులను ఎంతగా దుమ్మెత్తి పోస్తాయో ఊహించడం కష్టం. ఎందుకంటే ఈ భూమి మీద తాము తప్ప వేరే ప్రాణి ఉండకూడదు అని స్వార్ధంతో బ్రతికే జీవి ఏదైన ఉందంటే అది ఒక మనిషి మాత్రమే అని నిక్కచ్చిగా చెప్పవచ్చూ. ఇకపోతే ఇప్పుడు ఆస్ట్రేలియాను కార్చిచ్చు దహించి వేస్తున్న విషయం తెలిసిందే. దేశంలో అగ్ర భాగం మంటల్లోనే ఉంది. దీనితో ఆస్ట్రేలియాలో వేల ఎకరాల్లో పంటలు, లక్షల ఎకరాల్లో అడవులు, కోట్ల సంఖ్యలో అడవి జంతువులు, పెంపుడు జంతువులు అగ్నికి ఆహుతి అయిపోతున్నాయి.

 

 

చాలా రాష్ట్రాల్లో చెలరేగుతున్న మంటలు ఆస్ట్రేలియాను ఇబ్బంది పెడుతున్నాయి. మంటల దెబ్బకు జనం అల్లాడిపోతున్నారు.. ఇదిలా ఉండగా ఇప్పుడు ఆ దేశంలో మనుషులు బ్రతకాలంటే 10 వేలకు పైగా ఒంటెలను చంపెయ్యాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం భావిస్తోందట.. దానికి ఉన్న పెద్ద కారణం ఏంటంటే. ఆ మంటల వేడికి నీళ్ళు అవిరైపోయి, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, ఉన్న కొద్దిపాటి నీళ్లను ఒంటెలు భారీగా తాగేస్తున్నాయట. నీళ్లు లేక ప్రజలు ఎడారి జీవితం గడుపుతున్నట్లు తెలుస్తున్న నేపధ్యంలో ఆ దేశం ఈ సంచలన నిర్ణయం తీసుకుందట..

 

 

మనుషులు బ్రతకాలంటే ప్రత్యామ్నాయ మార్గాలు మార్గాలు వెతకాలే గాని, నోరు లేని జీవాలను చంపినంత మాత్రన సమస్యకు పరిష్కారం లభించినట్లు కాదని జంతు ప్రేమికులు గగ్గోలు పెడుతున్నారట. నిజమే కదా అన్ని తెలిసిన మానవుడు తప్పు చేసి ఎన్నో శిక్షలనుండి తప్పించుకుంటుండగా, నోరులేని జీవాలు వాటికి మనిషికి ఉన్నంత జ్ఞానం లేదు కనుక అవి చేసే పనులను తప్పుగా భావించడం మనిషి అజ్ఞానానికి నిదర్శనం అంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: