లెఫ్ట్ పార్టీల రూటే సెపరేటు. తీరిక సమయంలో మాత్రం ఇద్దరం కలిసి పనిచేసే ఆలోచన చేస్తున్నామంటారు.  కానీ ఆచరణలోకి వచ్చే సరికి మాత్రం ఎవరి దారి వారు వెతుక్కుంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు వేరు వేరు ఎజెండాలు ఎత్తుకున్నా... మున్పిపల్ ఎన్నికల్లో మాత్రం ఐక్యతా రాగం వినిపిస్తున్నాయి.

 

తెలంగాణ ఉద్యమం సమయం నుంచే రాష్ట్రంలో కమ్యూనిస్ట్ ప్రభావం తగ్గిపోయింది. అటు party OF INDIA' target='_blank' title='సీపీఐ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సీపీఐ, సీపీఎం పార్టీలు ప్రస్తుతం అసెంబ్లీలో ఉనికిని కూడా కోల్పోయాయి. ముందస్తు ఎన్నికల్లో సీపీఎం పార్టీ కొత్త తరానికి కొత్త రాజకీయం అంటూ... బీఎల్ ఎఫ్ తో జట్టు కట్టి ఎన్నికలకు వెళ్లింది. తనకు పట్టుందని చెప్పుకున్న నియోజకవర్గాల్లో కూడా...కనీసం ప్రభావం కూడా చూపించలేకుండా పోయింది. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో అయినా గెలిచే అవకాశాలుండేవి కానీ...అది కూడా లేకుండా పోయింది. ఎన్నికల తరువాత... సీపీఎం తన ఆలోచన తప్పని తెలుసుకుంది. సీపీఎం అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన ప్రయోగం విఫలం  అయ్యింది. అటు party OF INDIA' target='_blank' title='సీపీఐ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సీపీఐ పార్టీ కూడా కాంగ్రెస్,. టీడీపీ, జనసమితితో కలిసి పనిచేసింది. పొత్తులు సీట్ల సర్దుబాటుతోనే సమయం అంతా గడిచిపోయింది. ఎన్నికల్లో కనీసం ఒక్క సీటును కూడా గెలిపించుకోలేకపోయింది. ఎన్నికలకు ముందు లెఫ్ట్ పార్టీల కూటమి కట్టాలని సీపీఎం భావించింది. కానీ అప్పుడున్న పరిస్ధితిలో అందరం కలిపి కూటమిగా పోదాం అనే ఆలోచన చేసింది సీపీఐ. కానీ సీపీఎం రాలేం అని చెప్పేసింది. ఇప్పుడు మరోసారి వామపక్షాల ఐక్యత అంశం తెరపైకి వచ్చింది. 

 

మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర నాయకత్వాల్లో కొంత మార్పు కనిపించింది. సీపీఐ...జిల్లా కమిటీలకు ఎవరితో కలిసి పనిచేయాలనే విచక్షణ అప్పగించింది. ప్రతీ సారి ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పే సీపీఎం కూడా... party OF INDIA' target='_blank' title='సీపీఐ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సీపీఐ తరహాలోనే బీజేపీ తప్పా...ఎవరితోనైనా కలిసి పనిచేయాలనే ఆలోచన చేసింది. దీంతో  ఇన్నాళ్లు ఉప్పు..నిప్పుగా ఉండే సీపీఎం - party OF INDIA' target='_blank' title='సీపీఐ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సీపీఐ పార్టీలు మున్పిపల్ ఎన్నికల్లో కలిసి పనిచేయబోతున్నాయి. ఇప్పటికే జనగామ మున్పిపాలిటీలో సీపీఎం, సీపీఐ.. కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. ఇక ఖమ్మం, నల్గొండ జిల్లాలో కూడా రెండు పార్టీలు కలిసి... వస్తే కాంగ్రెస్ ని కలుపుకుని పనిచేయబోతున్నాయి. అయితే టీడీపీ కూడా... ఈ కూటమితోనే కలిసి పనిచేసే అవకాశాలున్నాయి. సీపీఎం... సీపీఐలు ఎప్పుడూ కలిసి పనిచేయటానికి సుముఖంగా లేవు. కానీ ఈ సారి మాత్రం మున్పిపల్ ఎన్నికల్లో కలిసి పనిచేసే అవకాశాలున్నాయి. 

 

దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీల విలీనం పై చర్చ జరుగుతుంటే.. తెలంగాణలో మాత్రం రెండు పార్టీలు కలిసి పనిచేసే పరిస్ధితి కూడా కనిపించటం లేదు. రోజు రోజుకు పార్టీల ప్రభావం తగ్గుతున్నా.. కలిసి నడిచే ఆలోచన ఎందుకు చేయటం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. మున్పిపల్ ఎన్నికల్లో అయినా... రాష్ట్రమంతా కలిసి పనిచేస్తారా..? లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: