ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో మూడు రాజధానుల వ్యవహారం పెద్ద డిస్కషన్ గా మారింది. అన్నీ జిల్లాల వాళ్ళూ ఈ విషయం మీదనే ఆలోచిస్తున్నారు. కొందరు దీన్ని వ్యతిరేకిస్తుంటే ఎందరో దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. రాష్ట్రానికి మంచి చెసే ఉద్దేశ్యం తోనే జగన్ ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారు అని చెప్పే ప్రయత్నం వైకాపా ఎంత చేస్తున్నా కూడా టీడీపీ యొక్క కుటిల ప్రయత్నాల వల్ల అమరావతి జనం అటువైపే మొగ్గు చూపినట్టుగా కనిపిస్తోంది. దీనిమీద రాజకీయ నాయకులు సైతం ఎవరి మనసులో మాట వారు బయట పెడుతున్నారు. రీసెంట్ గా కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని విషయంపై కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుందని.. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించిన తరువాతే కాంగ్రెస్ పార్టీ అధికారికంగా స్పందిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

 

 

అప్పట్లో మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు కూడా  చాలాసార్లు  అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయాలు వేర్వేరు చోట్ల ఉండడం సాధ్యం కాదని రుజువు అయింది అని  ఆయన అన్నారు.ఉమ్మడి రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషించిన జైరాం రమేష్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అభివృద్ధి వికేంద్రీకరణ కి మాత్రం కాంగ్రెస్ ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటుంది అన్నట్టు ఆయన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. జగన్ కి ఈ విషయం లో కాంగ్రెస్ నుంచి సపోర్ట్ లభించేనట్టే అనుకోవచ్చా ? అయితే అమరావతి నే రాజధానిగా ఉంచాలా లేదా అనే విషయం మీద స్పందించడానికి మాత్రం ఆయన నిరాకరించారు.

 

 

అనేక విషయాలలో ఐడియా , నాలెడ్జ్ ఉన్న ఇలాంటి నాయకులే ఇలా అంటే ఎలా ? భవిష్యత్తు గురించి బాధ్యతాయుతంగా వివరించాల్సిన సీనియర్ లీడర్లు ఇలా సైలెంట్ గా ఉండడం తగదు అంటున్నారు విశ్లేషకులు. మూడు రాజధానుల విషయం లో జగన్ అధికారిక ప్రకటన ఇంకా చేయకుండానే టీడీపీ అనవసర హడావిడి చేస్తోంది అంటూ వైకాపా నాయకులు మండిపడుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: