ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అక్రమ ఆస్తుల కేసు విషయంలో హైదరాబాద్ నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం కు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఇకపోతే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలనాపరమైన వ్యవహారాలతో బిజీగా ఉన్నందున తనకు వ్యక్తిగత మినహాయింపు కావాలి అంటూ సిబిఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. అయితే సీఎం జగన్ వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సీబీఐ ప్రత్యేక కోర్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత హాజరు మినహాయింపు ను కొట్టివేసింది. దీంతో నేడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సారి జగన్ మోహన్ రెడ్డి సిబిఐ ప్రత్యేక కోర్టు విచారణలో హాజరుకానున్నారు. ఇకపోతే ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన తల్లి విజయమ్మ సోదరి షర్మిల కూడా నేడు కోర్టుకు హాజరుకానున్నారు. 

 

 

 అయితే సీఎం హోదాలో కోర్టుకు రావాలంటే భద్రతా కారణాలు బందోబస్తు ఖర్చులు భారీగా ఉంటాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణంగా చూపుతూ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరఫు న్యాయవాది నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టును అభ్యర్థించగా... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి  వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదనలు రావడంతో న్యాయస్థానం జగన్మోహన్ రెడ్డి  పిటిషన్ను తోసిపుచ్చింది. దీంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో విచారణకు హాజరు అవడం అనివార్యమైంది. కాగా కొన్ని వారాల తర్వాత నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హైదరాబాదులోని నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు విచారణకు హాజరు కానున్నారు. 

 

 

 ఇక ఇదే సమయంలో యాదృచ్చికంగా నేడే వైఎస్ విజయమ్మ, షర్మిలలు ఓ  కేసు విచారణలో భాగంగా హైదరాబాద్ కోర్టులో కూడా హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న సమయంలో 2012 సంవత్సరంలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే వరంగల్ జిల్లా పరకాలలో సభ నిర్వహించడం ద్వారా.. ఎన్నికల కోడ్ ను  ఉల్లంఘించారని వైయస్ విజయమ్మ షర్మిల పై కేసు నమోదైంది. అయితే ఈ కేసులో వీరిరువురూ ఇప్పటివరకు విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈ ఇద్దరికీ సమన్లు జారీ కాగా నేడు కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఇదే కేసులో కొండా మురళి కొండా సురేఖ దంపతులు కూడా కోర్టుకు రానుండడంతో 2 కోర్టుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: