ఏదో రకంగా జనాల్లో పాపులర్ అవ్వడంతో పాటు తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకు వచ్చే దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ విషయంలోనూ ప్రభుత్వంపై పోరాడేందుకు పెద్దగా అవకాశం లేకపోవడంతో అమరావతి వ్యవహారాన్ని అందిపుచ్చుకున్నాడు చంద్రబాబు. జగన్ తీసుకున్న నిర్ణయంపై అమరావతి పరిసర ప్రాంతాల్లోని 29 గ్రామాల్లో కొంత మంది ప్రజలు, రైతులు వ్యతిరేకిస్తూ ఉండగా ఈ ఉద్యమాన్ని రాష్ట్ర సమస్యగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు గత 20 రోజులుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. 


మూడు ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రం అంతా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని వైసీపీ ప్రభుత్వం ఆధారాలతో సహా చెబుతున్నా బాబు మాత్రం కేవలం జగన్ కు తన మీద ఉన్న కోపంతోనే అమరావతి నుంచి రాజధాని దూరం చేస్తున్నాడని, రైతులను, ప్రజలను శోభ పెడుతున్నాడు అంటూ హడావుడి చేస్తున్నాడు. ఈ మేరకు మొన్న బెంజ్ సర్కిల్ ధర్నా చేసేందుకు ప్రయత్నించారు. బాబుకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆయన వినిపించుకోవడంతో వ్యాన్ ఎక్కించి మరి అరెస్టు చేశారు. నిన్న మచిలీపట్నంలో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో చంద్రబాబు ఆవేశంగా మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 


అదేవిధంగా ఈరోజు కూడా బస్సు యాత్ర చేపట్టేందుకు చంద్రబాబు సిద్ధమయ్యాడు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నుంచి మొదలయ్యే ఈ బస్సు యాత్ర తాడేపల్లిగూడెం, తణుకు, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వరకు కొనసాగుతుంది. ఆ తరువాత కోటిపల్లిలో చంద్రబాబు బహిరంగ సభ లో ప్రసంగిస్తారని తెలుస్తోంది. అయితే ఈ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు అని సమాచారం. అయినా చంద్రబాబు ఆ సభలో పాల్గొంటే అడ్డుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఆందోళనలు, ధర్నాలు కనుక జరిగితే మొన్న బెంజ్ సర్కిల్ లో అరెస్టు చేసిన విధంగానే చంద్రబాబును పోలీసులు మరోసారి అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: