తెలుగు ప్రజలందరూ అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ మకర సంక్రాంతి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ ను పెద్ద పండుగగా భావించి అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. కొత్త అల్లుళ్ళు అందరూ అత్తారింటికి చేరుకొని తెగ సందడి చేస్తూ ఉంటారు... ఇక ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారందరూ సంక్రాంతి పండుగ ముందు సొంతూళ్లకు చేరుకొని... సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులు బంధు మిత్రులతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే గ్రామాల్లో సందడి మొదలైపోతుంది. హరిదాసు కీర్తనలు గంగిరెద్దుల ఆటలు ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు కనిపిస్తూ ఉంటాయి. ఇక సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేది గొబ్బెమ్మలు. ఇలా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటేలా జరుగుతూ ఉంటాయి. 

 

 

 అయితే నాటి తరం సంక్రాంతి సంబరాలు ప్రస్తుతం మనం మాట్లాడుకున్న విధంగా జరిగేవి  కానీ ఇప్పుడు మాత్రం సంక్రాంతి అదో సాదాసీదా పండుగల మారిపోయింది. హరిదాసుల కీర్తనలు కనిపించడం లేదు... గంగిరెద్దుల ఆటలు కనిపించడం లేదు... ఒకప్పుడు వాకిట్లో మొత్తం కొంచమైనా గ్యాప్ లేకుండా రంగు రంగుల ముగ్గులు వేస్తూ ఎంతో సంబరపడి పోయేవారు ఇంట్లోని ఆడపడుచులు. కానీ ఏదో మొక్కుబడిగా ఒకటో రెండో ముగ్గులు వేసే ఊరుకుంటున్నారు ఈ రోజుల్లో. ఇక వాకిట్లో పేడను తీసుకొచ్చి గొబ్బెమ్మలు చేసి వాటిపై నవధాన్యాలు వేసి... ప్రతి ఇంటి ముంగిట పెడుతూ ఉంటారు. కానీ నేటి రోజుల్లో మాత్రం గొబ్బెమ్మలు కరువై పోయాయి. 

 

 

 ఆనాడు కనుమ రోజున పిడకలను కాల్చేవారు... కానీ ఇప్పుడు మాత్రం ఆనాటి పిడకలు కనపడడం లేదు  గొబ్బెమ్మలు కనపడకుండా పోతున్నాయి. ప్రస్తుతం అంతా ఇన్స్టెంట్ కాలం నడుస్తోంది. ఏది కావాలన్నా మార్కెట్లో కృత్రిమంగా దొరుకుతుంది. ప్రస్తుతం గొబ్బెమ్మలు కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. ఆన్లైన్లో గొబ్బెమ్మలు పిడకలు కూడా కేజీల లెక్కన అమ్ముడుపోతున్నాయి . ఒకప్పుడు పేడ తెచ్చి పిడకలు చేసి గోడకు కొట్టేవాళ్ళు. పిడకలు తయారు చేయడానికి నానా హంగామా ఉండేది. ఇప్పుడు మాత్రం అది ఎక్కడా కనిపించడంలేదు. సంబరాల సాంప్రదాయ సంక్రాంతి కాస్త రోజురోజుకు మోడ్రన్ సంక్రాంతి గా మారిపోతుంది. ఇక ఆన్లైన్లో అయితే పాతిక పిడకలు వంద రూపాయలట. ఇక ఇది చూసిన కొంతమంది అబ్బో పేడకి  కూడా మంచి గిరాకీ వచ్చిందే  అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: