ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల  నిర్ణయం  ప్రకటించినప్పటి నుంచి రాజధాని అమరావతి లో తీవ్రస్థాయిలో నిరసనలు ఆందోళనలు కొనసాగుతున్న  విషయం తెలిసిందే. రైతులందరూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులు  కుటుంబాలతో కలిసి రోడ్లపై ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. మరోవైపు అమరావతి సంరక్షణ కమిటీ విరాళాలు సైతం సేకరిస్తుంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అమరావతిలో పర్యటిస్తూ రైతులు చేస్తున్న నిరసనలు ఆందోళనలకు  మద్దతు తెలుపుతున్నారు. జగన్ మూడు రాజధానుల  నిర్ణయం పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇకపోతే అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 

 

 ముఖ్యమంత్రి చెబితే పోలీసులు చేసేస్తారా... మీకు చట్టం తెలియదా అంటూ నిలదీశారు చంద్రబాబు నాయుడు. మీరు ఐపీఎస్ చేయాలా..  ఏం చెప్పారు ఐపీఎస్ లో  రాగద్వేషాలకు అతీతంగా పని చేయాలని ప్రభుత్వం తప్పుడు పనులు చేయమని చెప్పిన చేయకూడదని చెబుతారని  గుర్తు చేశారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. అలాంటిది ట్రైనింగ్ లో చెప్పిన విషయాలు అన్నింటినీ మర్చిపోయి చట్టాన్ని మానవ హక్కులను ఉల్లంఘించే మహిళ పైన దళితులపైన రైతుల పైన దాడి చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఒక సీనియర్ నాయకుడిగా మాట్లాడే హక్కు తనకు ఉందని తెలిపారు చంద్రబాబు నాయుడు. రాజధాని అమరావతి మొత్తం యుద్ధభూమిల తయారై పోయిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు... ఇదేమైనా పాకిస్థానా... ఆడపిల్లల పై దాడి చేసి పోలీస్ స్టేషన్కు తీసుకు వెళ్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

 వెస్ట్ గోదావరి ఎస్పీ పెద్ద పుడింగా  అంటూ చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసులు తమ డ్యూటీ చేయాలని చట్టప్రకారం నడుచుకోవాలి తప్ప... తనను రాకూడదు అని చెప్పడానికి వీళ్ళు ఎవరు అంటూ మండిపడ్డారు చంద్రబాబు నాయుడు. తనను ప్రజలు కలవకూడదని మాట్లాడకూడదు అని చెబుతారా తాను ఏమన్నా దేశద్రోహీనా  అంటూ ప్రశ్నించారు. ఇకపోతే అమరావతి మొత్తం ఇప్పటికే 20 రోజులకు పైగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రోజురోజుకు నిరసనలు ఈ నిరసనలు మరింత ఉధృతమవుతోన్నాయి . ఇక రాజధాని అధ్యయన  కమిటీలు రెండు జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ నివేదిక ఇవ్వడం తో నిరసనలు మరింత ఎక్కువయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: