డబ్బు అంటే ఏంటో ప్రతి వారికి తెలుసు. అది ఆనందంగా జీవించేలా చేస్తుంది. నలుగురిలో నవ్వులపాలు చేస్తుంది. కన్నీరు పెట్టిస్తుంది. బందాలను, స్నేహితులను శత్రువులుగా మారుస్తుంది, విడిపోని బందువులుగా నిలుపుతుంది. ఏం చేయాలన్న ఒక డబ్బుతోనే సాధ్యం. ఇక అతి అనేది అన్ని అనర్దాలకు మూలం. అతివల్ల జరిగే మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. సమాజంలో ఎవరైన సరే తన పరిమితిలో తానుంటే కొంతవరకు మేలు. అదే తనపరిమితి దాటి ప్రవర్తిస్తే అతనికి ఉన్న విలువ తగ్గి ఒక పనికి మాలిన వాడిగా చిత్రింపబడుతాడు.

 

 

ఇక నలుగురిలో ఉన్నప్పుడు నాలుకను, మనసును అదుపులో ఉంచుకోవాలి. ఇలా అదుపులో ఉంచుకోక ఎందరో అబాసు పాలవ్వడం, లేదా ప్రాణాలు కోల్పోవడం ఇప్పటి వరకు చూసాం, విన్నాం. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. సంతోషంగా స్నేహితులతో పార్టీ చేసుకుంటున్న ఓ యువకుడు అతికి పోయి, ప్రాణాలు తీసుకున్నాడు. ఆ వివరాలు తెలుసుకుంటే. నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి మండలం కోసంగి కాలనీలో జరిగిన ఈ ఘటన ఆ కుటుంబంలో పండగ సమయంలో విషాదం నింపింది.

 

 

ఇకపోతే తన స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకుంటున్న కాశయ్య అనే వ్యక్తికి, అతని స్నేహితులకు ఉత్సాహం ఎక్కువైనట్లు ఉంది. కాయకూడని పందెం కాశారు. అదేమంటే అరగంట సమయంలో ఫుల్ బాటిల్ విస్కీ ఎత్తిన సీసా దించకుండా తాగుతే వెయ్యి రూపాయలు ఇస్తామని పందెం కాశారు కాశయ్య స్నేహితులు. ఊరికే వచ్చే వెయ్యిరూపాయలు ఎందుకు వదులుకోవాలని అనుకున్నాడేమో కాశయ్య దానికి ఆశపడి, ఫుల్ బాటిల్ మందుని క్షణాల్లోనే గటగటా తాగేశాడు.

 

 

వెంటనే అక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. భయాందోళనకు గురైన స్నేహితులు కాశయ్య మృతదేహాన్ని అతని ఇంటివద్ద వదిలేసి వెళ్లిపోయారు. చూశారా పరాచికం ప్రాణాలు తీసింది. ఆ కుటుంబంలో ఒక ప్రాణాన్ని తీసుకుపోయి, వారిని అనాధలను చేసింది. ఇక ఈ ఘటనపై మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: