30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఓ సినిమాలో డైలాగ్ చెప్పి అందరిచేత మంచి గుర్తింపు సాధించిన నటుడు పృథ్వీరాజ్, ఆ తరువాత రాజకీయాల వైపు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహించడంతో పాటు జగన్ పాదయాత్ర లో అప్పుడప్పుడు పాల్గొంటూ ఆ తన స్వామి భక్తిని ప్రదర్శించాడు.  అంతకు ముందే పోసాని, మోహన్ బాబు ఇలా అనేక మంది సినీ ఇండస్ట్రీకి చెందిన వారు వైసీపీలో ఉన్నా, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పృథ్వికి నామినేటెడ్ కోటాలో ఎస్. వి. బి.సి చైర్మన్ పదవిని జగన్ కట్టబెట్టారు. అయితే అదే సమయంలో పోసాని , మోహన్ బాబు తదితరులు కూడా పక్కనపెట్టి మరీ పృథ్వి కి ప్రయారిటీ ఇచ్చారు.


 ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తరువాత ఆయన ఎస్. వి. బి.సి లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, అనేక విమర్శలకు తాతావివ్వడంతో అధిష్టానం గుర్రుగా ఉంటూ వస్తోంది. తాజాగా పోసాని కృష్ణ మురళి  పృథ్విపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం వెనుక  అధిష్టానం అండదండలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ ధీమాతోనే పోసాని తమ పార్టీ నాయకుడైన పృథ్వి పై  విమర్శలు చేసినట్టు తెలుస్తోంది. వాస్తవంగా ఎస్విబిసి చైర్మన్ గా పదవి చేపట్టిన పృథ్వి అక్కడ చేపట్టిన నియామకాలు వివాదానికి కారణంగా తెలుస్తోంది.


 ఈ విషయంలో జగన్ చిన్నాన్న టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తో పృథ్వి కి అభిప్రాయ బేదాలు తలెత్తుతాయి అని, దీని కారణంగా ఆయన అధికారాల కు వై.వి అడ్డుకట్ట వేశారని, అందుకే ఆయన చేపట్టిన నియామకాలను మొత్తం రద్దు చేయడంతో ఈ వివాదం చెలరేగినట్టు సమాచారం. పృద్వి చైర్మన్ అయిన తర్వాత 35 మందిని ఎస్వీబీసీ లో వివిధ పదవుల్లో నియమించారని, ఆ పదవులు నియామకం కోసం భారీ ఎత్తున సొమ్ము తీసుకున్నట్టు అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి.


 వెంటనే ఆయన అధికారాలకు  అడ్డుకట్ట వేయాల్సిందిగా వై వి సుబ్బారెడ్డి కి జగన్ సూచించినట్టు సమాచారం. దాని కారణంగానే పృధ్విని కంట్రోల్ చేసేందుకు అదే సినీ పరిశ్రమకు చెందిన ముక్కుసూటి మనిషి పోసాని కృష్ణ మురళి ద్వారా కామెంట్స్ చేయించినట్లు తెలుస్తోంది. తనపై పోసాని  ఓ రేంజ్ లో ఫైర్ అవ్వడం వెనుక అధిష్టానం ఆశీస్సులు కూడా ఉన్నట్టుగా తెలియడంతో పాటు, తనకు కూడా పార్టీ నుంచి వార్నింగ్ రావడంపై తీవ్ర మనస్తాపం చెందినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: