నగరం పల్లె బాట పట్టింది. ఉరుకులు పరుగుల జీవితాన్ని గడిపే ప్రజలు సంక్రాంతి పండగకు సొంతూరి బాట పట్టారు. దీంతో రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. కనీసం కాలు పెట్టడానికి లేనంతగా నిండిపోయాయి ట్రైన్లు. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినా.. రద్ధీ మాత్రం తగ్గడం లేదు.  

 

సొంతూళ్లలో సంక్రాంతి పండగ జరుపుకునేందుకు సిటీజనం పల్లెబాట పట్టారు. రైలు, బస్సు, వాహనాలు ఏది పడితే అది ఎక్కి సొంత ఊళ్లకు వెళ్లాలని తహతహలాడుతున్న జనం రైళ్లకు ప్రిపరెన్స్ ఇస్తున్నారు. ఎలాగోలా తమ గమ్యాన్ని చేరేందుకు నానా తంటాలు పడుతున్నారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో అయితే ట్రైన్ ఎక్కడం గగనమవుతుంది. ఒక్కసారిగా జనం ట్రైన్‌ వైపుగా దూసుకెళ్తున్నారు. దీంతో మహిళలు ట్రైన్‌ ఎక్కాలంటే నరకం చూస్తున్నారు. ప్రయాణీకులను పోలీసులు అదుపుచేయాల్సి వస్తుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

 

పండుగల కోసం  రైల్వేశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రయాణీకులకు ఇక్కట్లు తప్పడం లేదు. సరిపడా ట్రైన్స్‌ లేకపోవడంతో కిక్కిరిసిపోయి ప్రయాణం చేయాల్సి వస్తోంది. ట్రైన్‌లోకి ఎక్కేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ట్రైన్‌లో సీటు దొరకడం పక్కనబెడితే కనీసం కాలు పెడితే చాలని ప్రయాణీకులు భావిస్తున్నారు. ఎంత దూర ప్రాంతానికైనా ఒంటికాలి మీదే ప్రయాణించేందుకు వెనకాడటం లేదు కొందరు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని ప్రయాణీకులు చెప్తున్నారు. 

 

రద్దీ దృష్ట్యా మరికొన్ని రైళ్లు అదనంగా వేయాలని ప్రయాణీకులు కోరుతున్నారు. ఉన్న రైళ్లలో అదనపు బోగీలు ఏర్పాటు చేయాలని, కనీసం పండగ మూడ్రోజులు మరిన్ని రైళ్లను  తెలుగు రాష్ట్రాల రూట్లను కవర్ అయ్యే విధంగా ప్రత్యేక హాల్ట్‌లు  అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. మొత్తానికి సంక్రాంతికి జనం పల్లెబాట పట్టడంతో అటు టోల్ గేట్లు, ఇటు రైల్వే స్టేషన్లు,  బస్ స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినా.. రద్ధీ మాత్రం తగ్గడం లేదు.  

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: