ప్రస్తుత ఆంధ్ర  రాజకీయాల్లో  తీవ్ర సంచలనం రేపుతున్న అంశం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానులు . ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా 3 రాజధానుల  ప్రకటన చేసినప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీలన్నీ గగ్గోలు పెడుతున్నాయి. రాజధాని అమరావతి నుంచి తరలిస్తే ఉరోకోబోము  అంటూ హెచ్చరిస్తూ  విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు అమరావతి రైతులు కూడా జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీవ్రస్థాయిలో నిరసనలు ఆందోళనలు చేపడుతున్నారు. అమరావతి నిర్మాణం కోసం పంట పండించే  భూములు ఇచ్చామని  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 రాజదానుల  నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అమరావతి రైతులు. అమరావతి రైతులు రైతు కుటుంబం మొత్తం రోడ్డుపైకి నిరసన తెలుపుతున్నారు. 

 

 

 ఈ నేపథ్యంలో అమరావతి రైతులందరికీ ప్రతిపక్ష టీడీపీ పార్టీ మద్దతు తెలుపుతుంది . టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అమరావతిలో పర్యటిస్తూ నిరసన తెలుపుతున్న రైతులందరికీ మద్దతు తెలుపుతూ అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.అటు  అమరావతి రైతులు చేపడుతున్న నిరసనలు రోజు రోజుకు మరింత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇప్పటికే పోలీసులు అమరావతి మొత్తం 144 సెక్షన్ అమలు చేసారు . ఎన్ని ఇబ్బందులు పడుకుంటూ అయినా సరే నిరసనలు దీక్షలను కొనసాగిస్తున్నారు అమరావతి రైతులు. ఈ క్రమంలోనే పోలీసులు మహిళలపై  లాఠీచార్జీలు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే దీనిపై ప్రతిపక్ష టీడీపీ నేతలు జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. మహిళపై అక్రమంగా లాఠీఛార్జ్ చేశారు అంటూ ఫిర్యాదు చేశారు. 

 

 

 అయితే  మహిళా కమిషన్ వచ్చే అమరావతిలో మహిళలను పలు వివరాలు అడిగి తెలుసుకున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత 25 రోజులుగా అమరావతి ప్రాంత గ్రామాల్లో యుద్ధవాతావరణం సృష్టించేలా గ్రామానికి వెయ్యి మంది పోలీసులను దింపారు అంటూ నారా లోకేష్ ఆరోపించారు. నిరసన చేస్తున్న మహిళలు ధారుణంగా బూటుతో తన్నించారు.  ఇప్పుడు జాతీయ మహిళా కమిషన్ వస్తుందని తెలిసి పోలీసులను  వెంటనే వెనక్కి పిలిపించి ఇన్ని రోజులు  చేసింది తప్పు అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారు అంటున్నారు అంటూ  లోకేష్ ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: