ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత రైతులకు మద్దతుగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటన చేస్తున్నారు. అమరావతి పరిరక్షణ సమితి యాత్రలో భాగంగా చంద్రబాబు కొడికొండ, పాలసముద్రంలో ర్యాలీ చేస్తూ జోలిపట్టి విరాళాలు సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా, మరోవైపు చంద్రబాబుకు వ్యతిరేకంగా గో బ్యాక్ అంటూ అనంతపురం జిల్లా వ్యాప్తంగా వైసిపి కార్యకర్తలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. పాల సముద్రం వద్ద వైసిపి కార్యకర్తలు చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ని అడ్డుకొనుగా.. అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.


చంద్రబాబు మాట్లాడుతూ... అమరావతి సమస్య కేవలం రాజధాని రైతులదే మాత్రమే కాదని.. ఉద్యమాన్ని రాష్ట్రం మొత్తం వ్యాప్తి చేసేందుకు పనిచేస్తానని అన్నారాయన. అలాగే ఈరోజు పెనుకొండ లో జరిగే బహిరంగ సభలో పాల్గొని ఆపై చెన్నేకొత్తపల్లి, మామిళ్ళపల్లి, రాప్తాడు మీదగా బళ్లారి బైపాస్ కు చేరుకోనున్నారు. అలాగే సాయంత్రం అనంతపురం జిల్లాలో మేము సైతం ప్రోగ్రాం మాదిరే చంద్రబాబు నాయుడు పండ్లు, టీలను అమ్మి విరాళాలను సంపాదిస్తారని అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు వెల్లడించారు. అయితే చంద్రబాబు నాయుడు రాయలసీమ నివాసులకు ఎంతో అన్యాయం చేశారని అందుకే అతని ర్యాలీని అడ్డుకుంటామని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.

 


ఇకపోతే, సోమవారం చేస్తున్నా ర్యాలీలో చంద్రబాబు నాయుడు పోలీస్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మంగళగిరి నుంచి అనుమతి లేకుండా బైక్ ర్యాలీ చేపట్టిన చంద్రబాబు నాయుడిని పోలీసులు అడ్డుకున్నగా.. వారిపై బాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నన్ను అడ్డుకుంటారా? మీకు ఎంత ధైర్యం? తమాషా చేస్తున్నారా అంటూ నోరు పారేసుకున్నారు. దీంతో పోలీసు సంఘాలతో పాటు పలు రాజకీయ నేతలు.. చంద్రబాబు నాయుడిని విమర్శిస్తున్నారు. విధి నిర్వహణ లో ఉన్నటువంటి గౌరవనీయులైన పోలీసులను ఇలా బెదిరించడం సరికాదని, చంద్రబాబు నాయుడు తన అసలైన రూపాన్ని బయట పెడుతున్నారని అనేకమంది విమర్శిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: