ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సడన్ గా ఈనెల 20వ తారీఖున అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సమావేశాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసిన అసెంబ్లీ కార్యదర్శి..అసెంబ్లీ, మండలిలకు నోటిఫికేషన్ జారీ చేసి..మూడు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు తెలిపారు. ఈ నెల 20-22 వరకు అసెంబ్లీ సమావేశాలు..రాజధాని సహా కీలక బిల్లులపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా జరగనున్న ఈ సమావేశాల్లో ఎంతో కీలకమైన సీఆర్డీయే చట్ట సవరణ బిల్లు సహా ఇంగ్లీషు మీడియం, ఎస్సీ వర్గీకరణ బిల్లులను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సమావేశాలకు సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేలందరికీ సందేశాలు వెళ్లాయి.

 

ఈ నెల 20న బీఏసీ సమావేశంలో షెడ్యూల్ ఖరారు చేస్తారు. ఈసారి సమావేశాల్లో జీఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నివేదికలపై మరియు అదే విధంగా హై పవర్ కమిటీ నివేదికపై భారీగా వాడివేడిగా చర్చలు జరగనున్నట్లు ఏపీ రాజకీయాల్లో వినబడుతున్న టాక్.

 

అంతేకాకుండా రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం తరఫున వరాల జల్లే అవకాశం ఉన్నట్లు వికేంద్రీకరణ ఏవిధంగా ఎందువల్ల జరగాలి అన్న దానిపై వైయస్ జగన్ సుదీర్ఘంగా ఏపీ ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పబోతున్నట్లు.., అంతేకాకుండా గత ప్రభుత్వం చంద్రబాబు హయాంలో అమరావతి ప్రాంతంలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ కి సంబంధించిన విషయాలను కూడా బయట పెట్టనున్నట్లు..కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ అయినా సీబీఐ చేత ఎంక్వయిరీ చేయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా మూడు రోజుల్లో సి ఆర్ డి ఏ చట్టం పై చాలా గట్టిగా హాట్ హాట్ గా చర్చలు జరగనున్నట్లు ఇందుకోసమే అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులు జరగనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వినబడుతున్న టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: