తెలంగాణ కాంగ్రెస్ కొత్త చీఫ్ ఎవరు?  ఎప్పటిలోగా కొత్త చీఫ్ నియామకం పూర్తవుతుంది. మార్పు అనివార్యం అని చెబుతున్నారు. కానీ ఇప్పటివరకూ ఓక్లారిటీ రాలేదు. ఎంత మంచి జరుగుతుందో తెలియదు కానీ. నాన్చుడు వల్ల నష్టపోతున్నామని సీనియర్లు వాపోతున్నారు. 

 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త చీఫ్ వచ్చేస్తున్నారు ..ఏడాది నుంచి ఒకటే చర్చ ఇప్పటివరకూ ఎవరన్నది క్లారిటీ లోకపోవడంతో.. కేడర్‌లో నిరుత్సాహం కనిపిస్తోంది. మున్సిపోల్స్ సమీపిస్తుండటంతో.. సీనియర్లు సైతం మనకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అయితే ..హైకమాండ్‌ సీరియస్‌గా వర్కవుట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుత పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. త్వరలోనే పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకోబోతున్నా అని కామెంట్ చేయడంతో.. పూర్తిస్థాయి క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.ఇప్పటికే ప్రాథమిక సమాచారం తెప్పించుకున్నఅధిష్టానం..వీలైనంత వేగంగా తేల్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల హడావుడిలో పార్టీపెద్దలు ఉండడంతో. పీసీసీ చీఫ్ నియామకం కొంత వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 16 లోపు... కొత్త చీఫ్ ఎవరన్న పార్టీ అధిష్టానం స్పష్టం చేయబోతుందని సమాచారం.

 

ప్రస్తుతం పీసీసీ రేసులో ఉన్న నాయకులంతా... మున్సిపల్ ఎన్నికల హడావుడిలో ఉన్నారు.పీసీసీ రేసులో ముందున్న మాజీ మంత్రి శ్రీధర్ బాబు..మంథనీనియోజకవర్గం, భూపాలపల్లి జిల్లాల్లో ఎన్నికల బాధ్యతలు చూస్తున్నారు. తను ప్రాతినిధ్యం వహిస్తున్న చోట పార్టీని గెలిపించి పట్టునిరూపించుకునే పనిలో పడ్డారు.అటు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు కూడా... తన నియోజకవర్గాల్లో గెలిచి పంతం నెగ్గించుకోవాలనుకుంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి .. తన అసెంబ్లీ నియోజకవర్గంలో మున్సిపాలిటీలపై నజర్ పెట్టారు. పదవి  ఆశిస్తున్న వారంతా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు పీసీసీ చీఫ్‌ను మారిస్తే..... ఇన్నాళ్లు ఎన్నికల కోసం పని చేసిన నాయకులు ఇబ్బంది పడటంతో పాటు.. నాయకత్వంలో కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. కొత్తగా పదవి తీసుకోవటం... వెంటనే ఎన్నికల్లో ఓటమి కి బాద్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి... ఎన్నికల తరువాతే కొత్త చీఫ్ నియామకం మేలని అధిష్టానంకు కొందరు సీనియర్ నేతలు సూచించినట్టు తెలిసింది. ఫిబ్రవరి నెలాఖరు నాటికి .. తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్ రానున్నారని , ఆశావహులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: