ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటినుంచి తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగు పడిన విషయం తెలిసిందే. ప్రతి విషయంలో మాకు మీరు మీకు మేము అన్నట్లుగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అవినాభావ సంబంధం తో ముందుకు సాగుతున్నారు. ఇక నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఏకాంతంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. తొమ్మిది పదో షెడ్యూల్లోని అంశాలపై  వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయానికి వచ్చారు..

 

 

 కాగా నేడు ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. కృష్ణా నది నీటి లభ్యత తక్కువగా ఉంటుందో వల్ల... తెలంగాణలోని మహబూబ్నగర్ నల్గొండ జిల్లాలో రైతులు నష్టపోతున్నారు అంతేకాకుండా రాయలసీమలోని రైతులకు కూడా సరైన నీటి లభ్యత లేదు... అయితే దీనిపై సుదీర్ఘంగా చర్చించిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు... ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల ద్వారానే గోదావరి జలాలను ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. ఇక 9 10వ షెడ్యూల్లో అనే అంశాలను కూడా త్వరగా పరిష్కరించుకోవాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించారు..

 

 

 ఇక ఇద్దరు ముఖ్యమంత్రులు తమ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో భేటీ  సమయంలోనే ఫోన్ చేసి మాట్లాడారు. 9 10వ షెడ్యూల్లో లోని అంశాలను పరిష్కరించుకునే దిశలో  సమావేశం కావాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇరు  రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడుతు మాకు మీరు మీకు మేము సహాయం చేసుకుంటూ ఇరు రాష్ట్రాల అభివృద్ధి చేసుకుందామనే  విధంగా ఇద్దరు ముఖ్యమంత్రులు ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: